నవతెలంగాణ హైదరాబాద్:
వినూత్న సినిమాలని నిర్మించడం లో నూతన దర్శకులు ముందు ఉంటున్నారు.అందులో ఒకరు నటుడు దర్శకుడు తల్లాడ సాయి కృష్ణ. ఎందరో మహానుభావులు, బ్లాక్ బోర్డ్, నమస్తే సేట్ జీ, దక్ష, మిస్టరీ లాంటి సినిమాలు తీసిన సాయి కృష్ణ రెండు సంవత్సరాలు గ్యాప్ తీసుకొని మరల ఇప్పుడు మెగాఫోన్ పట్టనున్నాడు.
ఈ సందర్భంగా తల్లాడ సాయి కృష్ణ మాట్లాడుతూ ఈ రెండు సంవత్సరాలు మూడు కథలని సిద్ధం చేసుకున్నాను,
అందులో ఒక సినిమా లో ప్రముఖ హిరో ఉండబోతున్నాడు, ఇంకొక సినిమా లో ఫెమస్ ప్రొడ్యూసర్ , పేమస్ హీరో కలసి చేయబోతున్నారు, ఇంకొక సినిమా అందరూ కొత్తవాళ్ళు, ఇలా మూడు కథలు సిద్ధం చేసుకోవాడానికి ఇంత సమయం పట్టింది, త్వరలో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు మొదలు అవబోతున్నట్లు తెలిపారు.
రొటీన్ స్టోరిస్ కి కాలం చెల్లింది, ఇప్పుడు ప్రేక్షకులు ప్రతి కథలో కొత్తదనం కోరుకుంటున్నారు.వారికి కావాల్సిన అంశాలు నా కథలో సమకూర్చాo అని అన్నారు.
– Advertisement –