
చండూరు మున్సిపాలిటీ పరిధిలోని అంగడిపేటకు చెందిన మహేశ్వరం సరితకు తెలుగు విశ్వవిద్యాలయం లో పి హెచ్ డీ సీటు రావడం పట్ల చండూరు సాహితీ మేఖల సభ్యులు అభినందనలు తెలిపారు. తెలుగు విశ్వవిద్యాలయం మంగళవారం రాత్రి ఎంపికైన పిహెచ్డి విద్యార్థుల వివరాలతో కూడిన ప్రకటన విడుదల చేసింది. కవిరత్న సాహిత్య శిల్ప సమీక్ష అనే అంశంపై చండూరు సాహితీ మేఖల వ్యవస్థాపకులైన కవిరత్న అంబటిపూడి వెంకటరత్నం జీవితము రచనలపై పరిశోధన చేయనున్నారు. పరిశోధకురాలు మహేశ్వరం సరిత హైదరాబాద్ లోని తెలుగు అకాడమీ ఉద్యోగిని. గతంలో డాక్టరేటు పొందిన ఇడికుడ సచ్చిదానందం కుటుంబంలో ఇదివరకే ఆయన సోదరి, సోదరులు నలుగురు డాక్టరేట్లు పొందగా ఇప్పుడు ఆయన భార్య సరితకు పీహెచ్డీ సీటు లభించడం విశేషం. అభినందనలు తెలిపిన వారిలో చండూరు సాహితీ మేఖల అధ్యక్షులు అంబటిపూడి సుబ్రహ్మణ్య శాస్త్రి, ప్రధాన కార్యదర్శి పున్న అంజయ్య, ప్రధాన వ్యవహర్త మంచుకొండ చిన బిక్షమయ్య, సభ్యులు మద్దోజు సుధీర్ బాబు డా.నిర్మలానంద, డా.చిదానంద, ఎస్.కె మజీద్, డాక్టర్ ఇడికోజు శ్రీనివాసచారి, సభ్యులు ఉన్నారు.