ABN
, Publish Date – Mar 17 , 2025 | 01:07 AM
తెలుగుయూనివర్సిటీకి పొట్టి శ్రీరాములు పేరునే కొనసాగించాలని కోరుతూ కరీంనగర్ ఆర్య వైశ్యసంఘాల ఆధ్వర్యంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండిసంజయ్‌కుమార్‌కు ఆదివారం వినతి పత్రం అందించారు.

బండిసంజయ్‌కుమార్‌కు వినతి పత్రం అందిస్తున్న ఆర్యవైశ్యసంఘాల నాయకులు
భగత్‌నగర్, మార్చి 16 (ఆంధ్రజ్యోతి): తెలుగుయూనివర్సిటీకి పొట్టి శ్రీరాములు పేరునే కొనసాగించాలని కోరుతూ కరీంనగర్ ఆర్య వైశ్యసంఘాల ఆధ్వర్యంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండిసంజయ్‌కుమార్‌కు ఆదివారం వినతి పత్రం అందించారు. పొట్టి శ్రీరాములు జయంతిని పురస్కరించుకుని నగరంలో కరీంనగర్ పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు నగునూరి రాజేందర్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో బండి సంజయ్‌కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్య్ర సమరయోధుడు పొట్టిశ్రీరాములు పేరును తెలుగుయూనివర్సిటీకి తొలగించడం సిగ్గుచేటన్నారు. తెలుగుయూనివర్సిటీకి ఆయన పేరును కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కరీంనగర్‌పట్టణ ఆర్యవైశ్యసంఘం అద్యక్షుడు నగునూరి రాజేందర్ మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే స్పందించి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవానలి లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. జిల్లా ఆర్యవైశ్యసంఘం అధ్యక్షుడు కన్న క్రిష్ణ మాట్లాడుతూ గాంధేయవాది అయిన పొట్టి శ్రీరాములు పేరును తెలుగు యూనివర్సిటీకి తొలగించడం సబబు కాదన్నారు. కార్యక్రమంలో మాజీ మేయర్ సునీల్‌రావు, బుస్స శ్రీనివాస్, మల్లికార్జున్, పొట్టి శ్రీరాములు ఫౌండేషన్ అధ్యక్షుడు ఉప్పల రామేశం, పట్టణ ప్రధాన కార్యదర్శి పెద్ది వేణు, సుద్దాల వెంకటేశ్, కొంజర్ల శ్రీకాంత్, కొమురవెళ్లి వెంకటేశం, జిడిగె సాయికృష్ణ, జిల్లా మహిళా అధ్యక్షురాలు చకిలం స్వప్న, రావికంటి భాగ్యలక్ష్మి పాల్గొన్నారు.
ఫ పొట్టి శ్రీరాములు జయంతిని పురస్కరించుకుని వాసవిక్లబ్ కపుల్స్ క్లబ్ కరీంనగర్ జిల్లా ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో అధ్యక్షుడు జిల్లా జగదీష్, సుద్దాల వెంకటేష్, బండఅజయ్‌రామ్, ఎస్ సామ లక్ష్మణ్, కైలాస నవీన్ పైడ రవి, బొడ్ల శ్రవణ్‌కుమార్ పాల్గొన్నారు.
Updated Date – Mar 17 , 2025 | 01:07 AM