
మలయాళ బ్లాక్‌బస్టర్ ‘ప్రేమలు’తో అలరించిన నస్లెన్ ‘జింఖానా’తో మరోమారు ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఖలీద్ రెహమాన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇప్పటికే మలయాళంలో బాక్సాఫీస్ వద్ద బిగ్ హిట్ అయ్యింది. ఖలీద్ రెహమాన్, జోబిన్ జార్జ్, సమీర్ కారత్, సుబీష్ కన్నంచెరి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పుడీ స్పోర్ట్స్-ప్యాక్డ్, యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ఈనెల 25న తెలుగులో విడుదల కానుంది. శ్రీ లక్ష్మి నరసింహ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. డైరెక్టర్ హరీష్ శంకర్ మాట్లాడుతూ,’ఈ సినిమా మలయాళంలో బ్లాక్ బస్టర్. ఈ సినిమాని సుబ్బారెడ్డి తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. డైరెక్టర్ ఖలీద్ రెహమాన్ బాక్సర్. కాబట్టే ఇలాంటి సినిమాని అద్భుతంగా తీయగలిగాడు. ట్రైలర్‌లో షాట్స్ చాలా బావున్నాయి. తన ఫస్ట్ సినిమా చాలా బావుంటుంది. అది నా ఆల్ టైం ఫేవరేట్. ఈ సినిమా కూడా పెద్ద హిట్. నైజాం శశి చేస్తున్నారు కాబట్టి ఇంక తిరుగువుండదు. ఈ సినిమాని పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా ట్రైలర్ నాకు చాలా నచ్చింది. నస్లెన్ అద్భుతమైన పెర్ఫార్మ్. ఈ సినిమాని అందరూ థియేటర్స్‌కి వెళ్లి చూడాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు. ‘నా గత సినిమాని ఎలా ఆదరించారో ఈ సినిమాని కూడా అలానే ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ఇది స్పోర్ట్స్ కామెడీ ఫిల్మ్. చాలా మంచి యాక్షన్ సీక్వెన్స్‌లు, పాటలు ఉంటాయి. ఖచ్చితంగా ఆడియన్స్ ఎంజారు చేస్తారు. ఈ సినిమాని డిస్ట్రిబ్యూషన్ చేస్తున్న సుబ్బారెడ్డికి థ్యాంక్స్’ అని డైరెక్టర్ ఖలీద్ రెహమాన్ చెప్పారు. హీరో నస్లెన్ మాట్లాడుతూ, ”ప్రేమలు’ సినిమాకి తెలుగు ప్రేక్షకులు ఇచ్చిన సపోర్ట్ మర్చిపోలేను. ఇది స్పోర్ట్స్ కామెడీ ఫిల్మ్. ఇది హీరో సెంట్రిక్ ఫిలిం కాదు. ఇందులో అందరూ హీరోలే. తెలుగునాట రెస్పాన్స్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నాను’ అని తెలిపారు. డైరెక్టర్ అనుదీప్ మాట్లాడుతూ,’ నస్లెన్‌కి కంగ్రాట్స్. ఈ సినిమా చాలా బావుంది. నేను చూశాను. స్పోర్ట్స్ కామెడీ చాలా బాగా తీశారు. తప్పకుండా మీరంతా మిస్ కాకుండా చూస్తారని కోరుకుంటున్నాను’ అని అన్నారు. మైత్రీ డిస్ట్రిబ్యూటర్ శశిధర్ రెడ్డి మాట్లాడుతూ,’ సుబ్బారెడ్డి ఈ సినిమా నైజం డిస్ట్రిబ్యూషన్‌కి మాకు అవకాశం కల్పించడం ఆనందంగా ఉంది. ‘మంజుమల్ బార్సు’ తర్వాత అంతటి విజయం సాధిస్తుందని నమ్ముతున్నాం. తెలుగు ఆడియన్స్ మంచి సినిమాని ఆదరిస్తారు. మలయాళంలో ఈ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో, ఇక్కడ కూడా అలాంటి పెద్ద విజయం సాధిస్తుంది’ అని తెలిపారు. డైరెక్టర్ సాగర్ కే చంద్ర మాట్లాడుతూ,’సుబ్బారెడ్డి ఈ సినిమాని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఇది నాకు హోం బ్యానర్ లాంటింది. ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. నస్లెన్ ‘ప్రేమలు’ నాకు చాలా ఇష్టం. ఈ సినిమా కూడా పెద్ద విజయం సాధించాలి’ అని చెప్పారు.