తెలంగాణ ప్రజలకు KCR క్షమాపణలు చెప్తారా..? KTR సమాధానం ఇదే! – Telugu Information | BRS Working President KTR responds to NDSA report on Kaleshwaram challenge

Written by RAJU

Published on:

తెలంగాణకు విఘాతం కలిగితే వెంటనే స్పందించే వ్యక్తి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అని బీఆర్ఎస్ వర్కింగ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలు నిరాధారమన్నారు. ఏప్రిల్ 27వ తేదీన వరంగల్ వేదికగా బీఆర్ఎస్ రజతోత్సవ సభ నిర్వహించబోతున్నారు. ఈ నేపథ్యంలో టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్ తో ప్రత్యేక ముఖాముఖిలో కేటీ రామారావు మాట్లాడారు.

ఈ సందర్భంగా NDSA రిపోర్ట్‌పై స్పందించారు కేటీఆర్. కాళేశ్వరం ప్రాజెక్టుపై వచ్చింది NDSA రిపోర్ట్ కాదని, అది NDA రిపోర్ట్‌ అన్నారు కేటీఆర్. నాలుగు నెలల క్రితం ఇచ్చిన NDSA రిపోర్ట్‌ని.. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడే ఎందుకు బయటపెట్టిందో చెప్పాలన్నారు. తప్పుడు ఆరోపణలు చేసే ముందు ఆధారాలను కూడా బయటపెట్టాలన్నారు. NDSA నిపుణులు కాళేశ్వరంలో కనీసం విచారణ జరిపారా? అని కేటీఆర్‌ ప్రశ్నించారు. బిహార్‌లో బ్రిడ్జ్‌లు కూలుతుంటే NDSA ఏమైంది? అని నిలదీసిన కేటీఆర్, కేసీఆర్‌పై గుడ్డి ద్వేషంతో కాళేశ్వరం ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్నారన్నారు. రైతులకు నీళ్లు ఇవ్వలేకపోయిన సీఎం రేవంత్ క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

తెలంగాణకు అన్యాయం కలిగితే స్పందించే తొలి వ్యక్తి కేసీఆర్ మాత్రమే అని కేటీఆర్ స్పష్టం చేశారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయంపై నల్గొండ వేదికగా ప్రధాని మోదీని కేసీఆర్ ప్రశ్నించారని కేటీఆర్ గుర్తు చేశారు. కేసీఆర్ ప్రశ్నించిన తర్వాతే KRMB స్పందించిందని కేటీఆర్ అన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights