మే 1 నుంచి సెలవులు
మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కమిషనరేట్ లో అంగన్వాడీ యూనియన్లు, అధికారులతో డైరెక్టర్ కాంతి వెస్లీ సమావేశం నిర్వహించారు. ఎండలు తీవ్రంగా ఉన్న కారణంగా మే 1 నుంచి నెల రోజుల పాటు అంగన్వాడీలకు సెలవులు ఇవ్వనున్నట్లు ఆయన పేర్కొన్నారు. అంగన్వాడీ లబ్దిదారులకు పౌష్టికాహారం అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. అంగన్వాడీ చిన్నారులకు, గర్భిణులకు, బాలింతలకు టేక్ హోం రేషన్ ద్వారా గుడ్లు, సరకుల సరఫరా చేయాలని ఆదేశించారు.