– అంగన్వాడీ సూపర్వైజర్ కె.విజయకుమారి
నవతెలంగాణ – ఆళ్ళపల్లి
ఆళ్ళపల్లి మండల పరిధిలోని తీగలంచ గ్రామం అంగన్వాడీ కేంద్రంలో శుక్రవారం స్థానిక అంగన్వాడీ సూపర్వైజర్ కె.విజయకుమారి పోషణ్ పక్వాడా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామములోని తల్లులకు చిరు ధాన్యాల ప్రాముఖ్యత గూర్చి వివరించడం జరిగిందన్నారు. మనకు అందుబాటులో ఉన్న ఖాలీ స్థలా(పెరడు)ల్లో పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, చిరు ధాన్యాలు పండించి, తీసుకోవాలని వివరించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాఠశాల టీచర్ బి.రవి, అంగన్వాడీ టీచర్లు కె.రమణ, సీహెచ్.సుమలత, ఆశా వర్కర్ ఈ.లక్ష్మీకాంత, గ్రామస్తులు, పిల్లలు పాల్గొన్నారు.

తీగలంచ అంగన్వాడీ కేంద్రంలో పోషణ్ పక్వాడా –

Written by RAJU
Published on: