తిరుమల ఘాట్‌రోడ్లకు మహర్దశ | Mahardasha for Tirumala ghat roads

Written by RAJU

Published on:


ABN
, Publish Date – May 05 , 2025 | 01:53 AM

తిరుమల ఘాట్‌రోడ్ల మరమ్మతులపై టీటీడీ దృష్టి సారించింది. రూ.10.75 కోట్లతో అభివృద్ధి చేయాలని సంకల్సించింది. తిరుపతి నుంచి తిరుమలకు చేరుకునే రెండవ ఘాట్‌రోడ్డు 17 కిలోమీటర్లు, తిరుమల నుంచి తిరుపతి చేరుకునే మొదటిఘాట్‌రోడ్డు 18 కిలోమీటర్ల పొడవుతో ఉంటాయి.

తిరుమల ఘాట్‌రోడ్లకు మహర్దశ

తిరుమల, మే4(ఆంధ్రజ్యోతి): తిరుమల ఘాట్‌రోడ్ల మరమ్మతులపై టీటీడీ దృష్టి సారించింది. రూ.10.75 కోట్లతో అభివృద్ధి చేయాలని సంకల్సించింది. తిరుపతి నుంచి తిరుమలకు చేరుకునే రెండవ ఘాట్‌రోడ్డు 17 కిలోమీటర్లు, తిరుమల నుంచి తిరుపతి చేరుకునే మొదటిఘాట్‌రోడ్డు 18 కిలోమీటర్ల పొడవుతో ఉంటాయి. భక్తు రద్దీ నేపథ్యంలో రోజూ 10 వేల వాహనాలు ఈ మార్గాల్లో రాకపోకలు సాగిస్తున్నాయి. లారీలు, టిప్పర్లు కూడా తిరుగుతుంటాయి. దీంతో తరచూ ఘాట్‌రోడ్లు దెబ్బతింటున్నాయి. చివరిగా 2021 జనవరిలో కొత్త రోడ్లు(బీటీ రెన్యూవల్‌ కోట్‌) వేశారు. అయితే కొవిడ్‌ తర్వాత వాహనాల సంఖ్య పెరిగింది. 2021 నవంబరు, డిసెంబరు నెలల్లో భారీ వర్షాలు, డ్రైనేజి, క్రాష్‌బ్యారియర్‌ వంటి పనులతో ఘాట్‌రోడ్లు భారీగా దెబ్బతిన్నాయి. అనేక ప్రాంతాల్లో గుంతలు ఏర్పాడ్డాయి.

వర్షాకాలం రాకముందే పూర్తి

భక్తులు ఇబ్బందులను దృష్టింలో పెట్టుకుని టీటీడీ అధికారులు ఘాట్‌రోడ్లలో మళ్లీ మరమ్మతులు చేపట్టాలని నిర్ణయించారు. బిట్యూమినస్‌ కాంక్రీట్‌, బిట్యూమినస్‌ మెకాడమ్‌, హాట్‌ అప్టైడ్‌ థర్మోప్లాస్టిక్‌ కంపౌండ్‌ వంటి పనులతో పాటు రైజ్డ్‌ పేవ్‌మెంట్‌ మార్కర్లు(రోడ్‌ స్టడ్స్‌), సైన్‌బోర్డులు వంటిని ఏర్పాటు చేయాలని ప్రణాళికలు రూపొందించింది. వర్క్స్‌ కమిటీ కూడా మరింత అఽధ్యయనం చేపట్టి చర్యలు తీసుకోవాలని సూచించింది. వర్షాకాలం రాకముందే ఈపనులు ప్రారంభించేలా టెండర్లను ఆహ్వానించేందుకు టీటీడీ సిద్ధమవుతోంది.

Updated Date – May 05 , 2025 | 01:53 AM

Google News

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights