తిరుపతి వెళ్లే భక్తులకు శుభవార్త..అందుబాటులో 32 ప్రత్యేక రైళ్లు..! ఈ స్టేషన్‌లలో ఆగుతాయి – Telugu Information | Particular trains to Tirupati from Charlapalli in Hyderabad, deets right here

Written by RAJU

Published on:

శేషాచల కొండలలో కొలువుదీరిన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి నిత్యం లక్షలాది మంది భక్తులు తిరుమల తిరుపతి ఆలయానికి వెళుతుంటారు. దేశవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులు వివిధ మార్గాల్లో తిరుమలకు చేరుకుని శ్రీనివాసుడి దర్శనం చేసుకుంటారు. అయితే హైదరాబాద్ నుంచి వెళ్లే శ్రీవారి భక్తులకు దక్షిణ మధ్య రైల్వే ఒక గుడ్ న్యూస్ చెప్పింది. వేసవి రద్దీ దృష్ట్యా తిరుపతికి పలు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. వేసవి సెలవులలో అనేక మంది పుణ్య క్షేత్రాలు, అలాగే టూర్లకు వెళ్తుంటారు. ఈ క్రమంలో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు తెలిపింది. ఈ ప్రత్యేక రైళ్లు ఏప్రిల్‌, మే నెలల్లో వారానికి రెండు చొప్పున నడపనున్నట్లు పేర్కొంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

వేసవి సెలవులు, ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే పలు మార్గాల్లో ప్రత్యేక రైళ్లను నడపనుంది. ఈ క్రమంలోనే హైదరాబాద్ నుంచి వెళ్లే తిరుమల తిరుపతి వెళ్లే ప్రయాణికుల కోసం 32 ప్రత్యేక రైళ్లను నడుపుతుంది. మే 23వ తేదీ వరకు ఈ స్పెషల్ ట్రైన్స్ వారానికి రెండు సార్లు అందుబాటులో ఉంటాయని రైల్వే అధికారులు ప్రకటించారు.. చర్లపల్లి నుంచి 07017 శుక్ర ఆదివారాల్లో అందుబాటులో ఉంటుంది. ఇక తిరుపతి నుంచి 07018 శని, సోమవారాల్లో నడుస్తుంది.

ఇది మల్కాజిగిరి, కాచిగూడ, మహబూబ్‌నగర్, జడ్చర్ల, డోన్, కడప, రేణిగుంట స్టేషన్లో ఆగుతూ వెళ్తుంది. చర్లపల్లి నుంచి ఉదయం 9: 35 గంటలకు బయలుదేరుతుంది ఈ స్పెషల్‌ ట్రైన్‌. తిరుపతి నుంచి సాయంత్రం 4: 40 గంటలకు అక్కడి నుంచి హైదరాబాద్ బయలుదేరుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights