తిరుపతి క్యారెక్టర్‌కి అద్భుతమైన రెస్పాన్స్‌

Written by RAJU

Published on:

తిరుపతి క్యారెక్టర్‌కి అద్భుతమైన రెస్పాన్స్‌తమన్నా నాగసాధుగా నటించిన చిత్రం ‘ఓదెల 2. సూపర్‌ నేచురల్‌ థ్రిల్లర్‌ ‘ఓదెల రైల్వే స్టేషన్‌’కి ఇది సీక్వెల్‌. సంపత్‌ నంది సూపర్‌ విజన్‌లో అశోక్‌ తేజ దర్శకత్వంలో మధు క్రియేషన్స్‌, సంపత్‌ నంది టీమ్‌వర్క్స్‌పై డి.మధు నిర్మించారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం అన్ని చోట్ల బ్లాక్‌బస్టర్‌ రెస్పాన్స్‌తో సక్సెస్‌ ఫుల్‌గా రన్‌ అవుతోంది. ఈ సందర్భంగా ఈ చిత్రంలో పవర్‌ఫుల్‌ పాత్ర పోషించిన యాక్టర్‌ వశిష్ఠ ఎన్‌.సింహ మీడియాతో మాట్లాడుతూ, ‘సింగర్‌గా కెరీర్‌ స్టార్ట్‌ చేశాను. కన్నడలో 25కి పైగా సినిమాలకి పాడాను. తెలుగులో సింగర్‌గానే ఎంట్రీ ఇచ్చాను. అజినీష్‌ నన్ను సింగర్‌గా లాంచ్‌ చేశారు. ‘ఓదెల’ వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నాను (నవ్వుతూ). ఈ సినిమాలోని పాత్ర కోసం బరువు పెరిగాను. ఈవిల్‌ క్యారెక్టర్‌ కోసం స్పెషల్‌ వాయిస్‌ మాడ్యులేషన్‌ ప్రాక్టీస్‌ చేశాను. నా వాయిస్‌ క్యారెక్టర్‌కి ప్లస్‌ అయ్యింది. సంపత్‌ నంది ‘ఓదెల 2′ ఐడియా చెప్పిన తర్వాత చాలా సర్‌ప్రైజ్‌ అయ్యాను. కథ విన్న తర్వాత చాలా కొత్తగా అనిపించింది. ఇలాంటి క్యారెక్టర్‌ ఎప్పుడూ చేయలేదు. ఇలాంటి కథ ఎక్కడా వినలేదు. తప్పకుండా అద్భుతంగా చేయాలని అనిపించింది. ఇందులో నేను చేసిన తిరుపతి క్యారెక్టర్‌ సీన్‌లో ఉన్నా లేకపోయినా తన నామస్మరణ సినిమా అంతా ఉంటుంది. ఇందులో కథానాయకుడు ఎవరైనా ఉంటే అది తిరుపతి క్యారెక్టర్‌ అనే చెప్పాలి. ప్రేక్షకులు తిరుపతి క్యారెక్టర్‌కి కనెక్ట్‌ అయ్యారు. నా క్యారెక్టర్‌కి వచ్చిన రెస్పాన్స్‌ చాలా ఆనందాన్ని ఇచ్చింది. తమన్నా వంటి నటితో యాక్ట్‌ చేయటం గొప్ప అనుభవం’ అని అన్నారు.

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights