– ఖాళీ బిందెలతో మహిళల ఆందోళన.
– పట్టించుకోని అధికారులు
నవతెలంగాణ – మల్హర్ రావు:
మండల కేంద్రమైన తాడిచెర్లలో పాత పంచాయతీ కార్యాలయం ఎదుట ఉన్న బోరు మోటర్ చెడిపేవడంతో నీటి ఎద్దడి ఏర్పడి జనం తాగునీటి కోసం అల్లాడుతున్నారు. సోమవారం మహిళలు తమ సమస్య పరిష్కరించాలని ఖాళీ బిందెలతో చెడిపోయిన బోరు వద్ద నిరసన వ్యక్తం చేసి ఆందోళన చేపట్టారు. చేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు తమ వార్డులో మూడు నెలలుగా నెలకున్న తాగునీటి సమస్యను పరిష్కరించాలని అధికారులకు వినతులు చేస్తున్న పట్టించుకోనే నాథుడే కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఓ వైపు విద్యుత్ బోరు చెడిపోయి సమస్య జటిలంగా మారిన నేపథ్యంలో మరోవైపు మిషన్ భగీరథ వాటర్ సైతం ఐదు నిమిషాలకు మించి రావడం లేదని తెలిపారు. మిషన్ భగీరథ వాటర్ రాక విద్యుత్ బోరు మరమ్మతులు చేపించకుండా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వాపోయారు.ఎండలు మండుతున్న నేపథ్యంలో తాగడానికి గుక్కెడు నీరు లేక గొంతు ఎండుతొందని మండిపడ్డారు ఇప్పటికైనా సంబంధించిన ఉన్నతాధికారులు పట్టించుకోని తాగునీటి సమస్యను కోరుతున్నారు.