తలనొప్పి ఎందుకు వస్తుంది..? ఇలాంటి లక్షణాలు కనిపిస్తే డేంజర్ అంట.. జాగ్రత్త మరి..

Written by RAJU

Published on:

తలనొప్పి ఎందుకు వస్తుంది..? ఇలాంటి లక్షణాలు కనిపిస్తే డేంజర్ అంట.. జాగ్రత్త మరి..

మారుతున్న వాతావరణం లేదా తక్కువ నిద్ర కారణంగా తలనొప్పి రావడం సర్వసాధారణం.. కానీ మీరు చాలా కాలంగా తలనొప్పితో బాధపడుతుంటే దానిని విస్మరించకూడదు. ఇది అనేక వ్యాధుల లక్షణం కావచ్చు. తలనొప్పి మైగ్రేన్ వల్ల కావచ్చు లేదా బ్రెయిన్ ట్యూమర్ వల్ల కావొచ్చు.. అయితే.. మైగ్రేన్ అనేది నేడు ఒక సాధారణ సమస్యగా మారుతోందని.. ఇది మహిళల్లో ఎక్కువగా సంభవిస్తుందని నిపుణులు చెబుతున్నారు. మైగ్రేన్ నొప్పి సాధారణంగా తలలో ఒక వైపున వస్తుంది.. తరచుగా వాంతులు వంటి లక్షణాలను కూడా కలిగి ఉంటుంది.

హార్మోన్ల మార్పులు, జన్యుపరమైన అంశాలు కూడా కూడా మైగ్రేన్ ను ప్రేరేపిస్తాయి. మైగ్రేన్ అత్యంత సాధారణ లక్షణం తలనొప్పి.. సాధారణం నుంచి తీవ్రంగా మారుతుంది.. కంటి సమస్యలు కూడా మైగ్రేన్ సాధారణ లక్షణం.. ఇది కాకుండా, అనేక వ్యాధులు కూడా తలనొప్పికి ఒక సాధారణ కారణం. సైనసైటిస్, మెనింజైటిస్ లాగా తలనొప్పికి కారణమవుతాయి. తలకు తీవ్రమైన గాయం కారణంగా కూడా తలనొప్పి కొనసాగుతుంది. తలనొప్పి కారణంగా, కళ్ళు, తల చుట్టూ ఉన్న ఇతర కండరాలలో కూడా నొప్పి కొనసాగవచ్చు.

మీకు చాలా కాలంగా తలనొప్పి ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించండి..

మీకు వారానికి ఒకటి లేదా రెండుసార్లు తలనొప్పి వస్తే అది సర్వసాధారణం.. కానీ తలనొప్పి.. ప్రతిరోజూ ఉన్నా.. ఉదయం నిద్రలేచిన తర్వాత తలనొప్పి మరింత తీవ్రంగా ఉన్నా .. దానితోపాటు వాంతులు లేదా దృష్టి మసకబారడం వంటి సమస్యలు ఉంటే ఖచ్చితంగా వైద్యుడిని సంప్రదించండి.

ఇది మైగ్రేన్ లేదా బ్రెయిన్ ట్యూమర్ లక్షణం కావచ్చు.. కణితి (ట్యూమర్) ఒక ప్రాణాంతక వ్యాధి. ఉదయం నిద్రలేచిన తర్వాత నిరంతర తలనొప్పి.. తీవ్రమైన తలనొప్పి ఈ వ్యాధి సాధారణ లక్షణాలు.. కానీ ప్రజలు దీనిని తరచూ విస్మరిస్తారు.. దీని కారణంగా ఇది తరువాత తీవ్రమైన సమస్యగా మారుతుంది. మెదడు కణితి ప్రాణాంతకం కావచ్చు.

అకస్మాత్తుగా తీవ్రమైన తలనొప్పి రావడం బ్రెయిన్ స్ట్రోక్ లక్షణం కావొచ్చు..

మీకు అకస్మాత్తుగా తీవ్రమైన తలనొప్పి వచ్చినా.. వాంతులు అయినా.. దృష్టి మసకబారినట్లు అనిపించినా.. మాట్లాడటంలో ఇబ్బంది ఉంటే.. ఇవి బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలు కావచ్చు. బ్రెయిన్ స్ట్రోక్ అంటే మెదడుకు రక్త సరఫరా సరిగ్గా లేకపోవడం.. దీని కారణంగా మెదడు కణాలు చనిపోవడం ప్రారంభమవుతాయి. ఇది తక్షణ వైద్య సహాయం అవసరమయ్యే తీవ్రమైన వైద్య అత్యవసర పరిస్థితి.. కావున ఇలాంటి విషయాలను విస్మరించకుండా వెంటనే వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది..

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Subscribe for notification
Verified by MonsterInsights