తయారీ రంగం దూకుడు

Written by RAJU

Published on:

న్యూఢిల్లీ: మార్చి నెలలో తయారీ రంగం కనివిని ఎరుగని వేగంతో దూసుకుపోయింది. కొత్త ఆర్డర్లు పెరగడంతో పాటు అందుకు అనుగుణంగా వస్తూత్పత్తి కూడా పెరగడంతో తయారీ రంగ సూచీ హెచ్‌ఎ్‌సబీసీ ఇండియా పీఎంఐ 58.1 పాయింట్లకు చేరింది. ఇది ఎనిమిది నెలల గరిష్ఠ స్థాయి. ఫిబ్రవరిలో ఇది 14 నెలల కనిష్ఠ స్థాయికి పడిపోయిన నేపథ్యంలో మార్చి నెల పీఎంఐ అద్భుతమైన రికవరీ సాధించిందని విశ్లేషకులంటున్నారు. అంతర్జాతీయ ఆర్డర్లు కొంతమేరకు తగ్గినా దేశీయ ఆర్డర్లు గణనీయంగా పెరిగాయని వారన్నారు. ఈ సూచీ 50 పాయింట్ల కన్నా పైన ఉంటే వృద్ధిపథంలో ఉన్నదని సంకేతం. గత జూలై తర్వాత మొత్తం విక్రయాలు ఈ స్థాయిలో ఉండడం ఇదే ప్రథమం.

ఇవి కూడా చదవండి:

Loan Charges: ఏప్రిల్‌లో పర్సనల్ లోన్స్‌పై ప్రధాన బ్యాంకులు వసూలు చేసే వడ్డీ రేట్లు

Business Idea: మహిళలకు బెస్ట్..లక్ష పెట్టుబడితో వ్యాపారం, నెలకు రూ.3 లక్షల ఆదాయం..

Read More Business News and Latest Telugu News

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights