ప్రస్తుతం ఐపీఎల్ 2025 సీజన్‌తో బిజీబిజీగా ఉన్న విరాట్ కోహ్లీ ఇటీవలె మోడట్, నటి అవ్నిత్ కౌర్ ఫొటోకు ఇన్‌స్టాగ్రామ్‌లో లైక్ కొట్టిన విషయం తెలిసిందే. ఆ విషయం సోషల్ మీడియాలో దావానంలో వ్యాపించింది. వామ్మో కోహ్లీ ఏంటి.. ఈ అమ్మాయి ఫొటోకు లైక్ చేయడం ఏంటని అంతా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే.. ఆ ఫొటోలో అమ్మాయి కాస్త మోడ్రన్‌గా ఉంది. కొంపదీసి.. ఈమెపై కోహ్లీ మనసు పారేసుకున్నాడా ఏంటి అంటూ నెటిజన్లు తప్పుగా కూడా అర్థం చేసుకున్నాడు. ఈ విషయంపై వైరల్ కావడంతో.. తాజాగా కోహ్లీ క్లారిటీ ఇచ్చాడు. అది ఇన్‌స్టాగ్రామ్ అల్గారిథమ్ తప్పు కారణంగా జరిగిందని, తన ఫీడ్ డిలీట్ చేస్తున్న క్రమంలో అల్గారిథమ్ తప్పుగా తీసుకుందని, అంతకుమించి దాని వెనుక ఎలాంటి ఉద్దేశం లేదంటూ పేర్కొన్నాడు.
ఈ అంశంపై ఎలాంటి ఊహాగానాలు ప్రచారం చేయొద్దంటూ కూడా కోహ్లీ కోరాడు. ఈ విషయం అంతా అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నట్లు కోహ్లీ పేర్కొన్నాడు. ఇటీవలె అనుష్క శర్మ బర్త్‌డే సందర్భంగా విరాట్ కోహ్లీ ఇన్‌స్టాలో తన భార్య అనుష్కకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు. నా బెస్ట్ ఫ్రెండ్, నా లైఫ్ పార్నర్ అంటూ కాస్త రొమాంటిక్‌గానే అనుష్కకు బర్త్‌డే విషెష్ చెప్పాడు. ఆ క్రమంలోనే అవ్నిత్ కౌర్ అనే ఓ అమ్మాయి హాట్‌గా ఉన్న పిక్‌కు కోహ్లీ లైక్ కొట్టినట్లు సోషల్ మీడియాలో పోస్టులు విపరీతంగా వైరల్ అయ్యాయి. దీంతో వాటికి కోహ్లీ ఒక్క పోస్ట్‌తో పుల్‌స్టాప్ పెట్టేశాడు.
Virat Kohli addresses social media controversy surrounding his interaction with Avneet Kaur’s fan page, cites an Instagram algorithm error.#ViratKohli pic.twitter.com/hoW2CIPBpI
— CricTracker (@Cricketracker) May 2, 2025
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..