టీజీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయని మొత్తం 19 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మెమోకు, వెబ్ సైట్ లోని మార్కులకు తేడాలున్నాయని పిటిషన్ లో పేర్కొన్నారు. అయితే తప్పుడు ప్రమాణ పత్రాలతో పిటిషన్‌లు దాఖలు చేసినట్లు గుర్తించిన హైకోర్టు గ్రూప్ -1 అభ్యర్థులకు రూ.20 వేల చొప్పున జరిమానా విధించింది. వీరిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

తప్పుడు పత్రాలతో అఫిడవిట్, గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టు జరిమానా- చట్టపరమైన చర్యలకు ఆదేశాలు

Written by RAJU
Published on: