కాంగ్రెస్ నుంచి ఇటీవల సస్పెన్షన్‌కు గురైన ఆ పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తాజాగా సంచలన వ్యా ఖ్యలు చేశారు. తనను సస్పెండ్ చేసినా.. పార్టీ నుంచి బహిష్కరించినా.. తాను ప్రజల తరపున, ముఖ్యం గా బీసీల తరఫున కొట్లాడుతానని స్పష్టం చేశారు. తాను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక.. తనను సస్పెండ్ చేశారని పేర్కొన్న ఆయన.. రేవంత్ రెడ్డి సర్కారు చేపట్టిన కుల గణనపై మరోసారి విమర్శలు గుప్పించారు. ఈ కులగణన తప్పుల తడగా మారిందన్నారు.
బీసీలకు అన్యాయం చేశారని.. ఇది కుల గణన కాదని.. రెడ్డి కులస్తులను గుర్తించే గణన అని గతంలో తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్టు మల్లన్న తెలిపారు. తనను సస్పెండ్ చేసినంత మాత్రాన.. తన నోరును సస్పెండ్ చేయలేరని తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. “బీసీ గణన తప్పు. అదొక చిత్తు కాయితం. దానిని తగలబెట్టడం తప్పా“ అని ప్రశ్నించారు. తన బాధ బీసీల అందరి బాధగా చెప్పుకొచ్చారు. దీనిని పరిష్కరించకుండా.. తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం దారుణమన్నారు.

ఇక, ఇదేసమయంలో మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్‌పై తీన్మార్ మల్లన్న పొగడ్తల వర్షం కురి పించారు. గతంలో కేసీఆర్ హయాంలో జరిగిన సమగ్ర కుటుంబ సర్వేను పక్కాగా చేపట్టారని అన్నారు. దీనివల్ల ఎంతో మంది పేదలకు మేలు చేసే అవకాశం దక్కిందంటూ.. కేసీఆర్ ప్రభుత్వాన్ని ఆకాశానికి ఎత్తేశారు. కానీ, ఇప్పుడు పేదల కోసం పనిచేస్తున్నామని చెప్పుకొంటున్నా.. కొందరు(రేవంత్) మాత్రం అగ్రవర్ణాల అభివృద్ధికి తపిస్తున్నారని ఎద్దేవా చేశారు.
కాగా.. రెండు రోజుల కిందట తీన్మార్ మల్లన్నను పార్టీ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో గత నెల 14న కుల గణన నివేదికను అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించా లని తీర్మానం చేశారు. అయితే.. దీనిని తప్పుబడుతూ.. తీన్మార్ మల్లన్న తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీసీ గణన పత్రాలను తగుల బెట్టారు. సీఎం రేవంత్ సహా జానా రెడ్డిలపై తీవ్ర విమర్శలు చేశారు. దీంతో ఆయనను వివరణ కోరుతూ పార్టీ నోటీసులు ఇచ్చింది. ఈ నోటీసులకు మల్లన్న రియాక్ట్ కాకపోవడంతో పార్టీ ఆయనను సస్పెండ్ చేసింది.