తండ్రి రోజు తాగొచ్చి తల్లిని తనను కొడుతున్నాడని.. కూతురు ఏం చేసిందో తెలుసా!

Written by RAJU

Published on:

ప్రతి రోజు తాగి వచ్చి తనను, తన తల్లిని టార్చర్‌ పెడుతున్నాడు ఓ తండ్రి. అతని వేధింపులతో విసిగి పోయిన భార్య మరో దిక్కులేక ఆలానే భరిస్తూ వచ్చింది. కానీ అతని పదహారేళ్ల కూతురు మాత్రం అతని పెడుతున్న టార్చర్‌ను భరించలేక పోయింది. తల్లి పుడుతున్న బాధలను చూడలేకపోయింది. ఓ రోజు తల్లి ఇంట్లో లేదు.. రోజులాగే తాగి వచ్చిన తండ్రి తనతో గొడవ పెట్టుకున్నాడు. దీంతో అప్పటికే తండ్రిపై పీకల్లోతు కోపంతో ఉన్న పదహారేళ్ల కూతురు గొడ్డలి తీసుకొని తండ్రిని నరికి చంపింది. తర్వాత తన తండ్రిని ఎవరో హత్య చేసి మృతదేహాన్ని మంచంపై పడేసి వెళ్లారని పోలీసులకు సమాచారం ఇచ్చింది. బాలిక సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేమాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని జష్‌పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది.

అయితే ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఏప్రిల్‌ 21న రాత్రివేళ తల్లి ఇంట్లో లేకపోవడంతో కూతురు ఒక్కతే ఉన్నట్లు పోలీసులు తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో మైనర్‌ బాలికను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తండ్రిని తానే హత్య చేసినట్టు ఆ బాలిక ఒప్పుకుంది. నిత్యం తాగి వచ్చి తల్లిని, తనను కొట్టడం, ఇంట్లో గొడవపడటం సహించలేక గొడ్డలితో తండ్రిని నరికి చంపినట్లు కూతురు అంగీకరించింది. ఈ విషయాన్ని స్వయంలో పోలీస్‌ అధికారులే తెలిపారు. దీంతో మైనర్‌ బాలికను జువైనల్ హోమ్‌కు తరలించినట్లు చెప్పారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights