Avesh Khan May Fit to Join in Lucknow Super Giants: హైదరాబాద్, చెన్నై, ఢిల్లీ, ఆర్‌సీబీ వంటి జట్లు ఐపీఎల్ 2025 సీజన్‌లో తమ తొలి మ్యాచ్‌లోనే విజయంతో ఖాతా తెరిచాయి. రిషబ్ పంత్ కెప్టెన్సీలో లక్నో సూపర్ జెయింట్స్ తొలి మ్యాచ్‌లో ఢిల్లీ చేతిలో ఓటమి పాలైంది. దీని తరువాత, రిషబ్ పంత్ నాయకత్వంలోని లక్నోకు పెద్ద ప్రయోజనం లభించింది. ఆ జట్టు డాషింగ్ ఫాస్ట్ బౌలర్ అవేష్ ఖాన్ ఇప్పుడు జట్టులో చేరడానికి పూర్తిగా ఫిట్‌గా ఉన్నట్లు ప్రకటించారు.
ఫిట్‌గా మారిన అవేష్ ఖాన్..
నిజానికి, అవేష్ ఖాన్ కొంతకాలంగా కుడి కాలు మోకాలికి నొప్పితో బాధపడుతున్నాడు. కానీ, ఇప్పుడు అతను కోలుకోవడం పూర్తయింది. బీసీసీఐ వైద్య బృందం అతనికి ఐపీఎల్ ఆడటానికి అనుమతి ఇచ్చింది. ఈ ఏడాది జనవరి నుంచి అవేష్ ఖాన్ క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. కాగా, భారతదేశం తరపున చివరి టీ20 మ్యాచ్ గత ఏడాది నవంబర్‌లో దక్షిణాఫ్రికాతో జరిగింది. కానీ, ఇప్పుడు అతను లక్నో జట్టులో చేరడం ద్వారా ఐపీఎల్‌లో విధ్వంసం సృష్టించడానికి సిద్ధంగా ఉన్నాడు.
అవేష్ ఖాన్ పై కోట్ల వర్షం..
అవేష్ ఖాన్ గురించి చెప్పాలంటే, అతను ఎప్పుడు జట్టులో చేరతాడో ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు . కానీ, మార్చి 27న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగే మ్యాచ్‌కు అతను జట్టులో చేరవచ్చని భావిస్తున్నారు. లక్నో జట్టు రూ.9.75 కోట్లు చెల్లించి అవేష్ ఖాన్‌ను తమ జట్టులో చేర్చుకుంది. ఐపీఎల్‌లో నాలుగు ఫ్రాంచైజీలకు ఆడుతున్న అవేష్ ఇప్పటివరకు 63 మ్యాచ్‌ల్లో బౌలింగ్ చేసి 74 వికెట్లు పడగొట్టాడు.
ఇవి కూడా చదవండి
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..