తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం 2025-26 వార్షిక బడ్జెట్ ను బుధవారం అసెంబ్లీలో ప్రవేశ పెట్టింది. ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క.. ఈ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. గతానికి భిన్నంగా ఈ దఫా చాలా తక్కువ నిడివితో ఉన్న బడ్జట్ ప్రతులను ముద్రించారు. మొత్తం రూ.3,04,965 కోట్లతో ఈ బడ్జెట్‌ను రూపొందించా రు. 2024-25 తెలంగాణ తలసరి ఆదాయం రూ.3,79,751 కోట్లుగా పేర్కొన్న మంత్రి భట్టి.. రెవెన్యూ వ్యయం రూ.2,26,982 కోట్లుగా ఉంటుందని పేర్కొన్నారు.
ఇక, కీలకమైన మూల ధన వ్యయం(ప్రాజెక్టులకు, అభివృద్ది కార్యక్రమాలకు వెచ్చించే సొమ్ము) రూ.36,504 కోట్లుగా కేటాయించారు. మహిళా శిశు సంక్షేమానికి 3 వేల కోట్లు కేటాయించారు. మైనారిటీల సంక్షేమానికి 3500 కోట్ల రూపాయలను కేటాయించినట్టు భట్టి వివరించారు. రెండు రోజుల కిందట ప్రారంభించిన రాజీవ్ యువ వికాసం పథకానికి అత్యధికంగా 6000 కోట్ల రూపాయలను కేటాయించడం విశేషం. ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చే ఉచిత విద్యుత్ రాయితీకి 3000 కోట్లు కేటాయించారు.
అందరూ ఎదురు చూస్తున్న రైతు భరోసా పథకానికి 18 వేల కోట్ల రూపాయలను 2025-26 బడ్జట్‌లో కేటా యించడం గమనార్హం. మహిళా శిశుసంక్షేమానికి 2862 కోట్లు కేటాయించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పా లనలో సాధించిన విజయాలను ఆర్థిక మంత్రి వివరించారు. అదేవిధంగా ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాల ను కూడా ఆయన పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన 9 మాసాల్లోనే 55 వేల మందికి కొత్తగా ఉద్యోగాలు కల్పించామని భట్టి తెలిపారు.
ఈ బడ్జెట్ ను వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు గుప్పించారు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసి పేకమేడలా కూల్చే బడ్జెట్ ఇదని విమర్శించారు. పదేళ్ల ప్రగతి చక్రానికి ఈ బడ్జెట్ పంక్చర్ చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల కష్టాలను తీర్చేలా ఈ బడ్జెట్ లేదని, ఢిల్లీకి మూటలు పంపించడానికి ఉపయోగపడే బడ్జెట్ లా ఉందని ఆరోపించారు.
The post ఢిల్లీకి మూటలు మోసే బడ్జెట్ ఇది: కేటీఆర్ first appeared on namasteandhra.