డ్రగ్స్‌ మాఫియాపై ‘అభినవ్‌’ పోరాటం

Written by RAJU

Published on:

డ్రగ్స్‌ మాఫియాపై ‘అభినవ్‌’ పోరాటంశ్రీ లక్ష్మి ఎడ్యుకేషన్‌ ఛారిటబుల్‌ ట్రస్ట్‌, సంతోష్‌ ఫిల్మ్‌ నిర్మిస్తున్న బాలల చిత్రం ‘అభినవ్‌’ చేజ్డ్‌ పద్మ వ్యూహ. ఈ చిత్ర పోస్టర్‌, ట్రైలర్‌ను తెలంగాణా రాష్ట్ర మంత్రి కొండా సురేఖ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ,’ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా సుధాకర్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. సమాజ శ్రేయస్సు కోసం, లాభాపేక్ష లేకుండా ఈ చిత్రాన్ని నిర్మించడం అభినందనీయం. ఇలాంటి చిత్రాలకు ప్రభుత్వ సహకారం తప్పకుండా ఉంటుంది. ట్రైలర్‌ ఎంతో ఇన్‌స్పైరింగ్‌గా ఉంది’ అని తెలిపారు. ‘గంజాయి, డ్రగ్‌ మాఫియా కబంధ హస్తాల్లో ఇరుకున్న గిరిజన అనాథ బాల కార్మికులను, హైదరాబాద్‌లోని ప్రముఖ స్కూల్‌లో చదువుతున్న విద్యార్థులు యోగ, ఆర్మీ శిక్షణ తీసుకుని, ఆ గంజాయి, డ్రగ్‌ మాఫియాను ఎలా అంతం చేసారు అనే కథాంశంతో చిత్రం ఉంటుంది. బాలల చిత్రం అయినా యాక్షన్‌ సన్నివేశాలతో బలమైన కథాంశంతో, పూర్తిగా ఉత్కంఠ భరితంగా ఉంటుంది. సారథి స్టూడియో సహకారంతో ఈ చిత్రాన్ని పూర్తి చేశాను. తెలంగాణ విద్యార్థులకు అతి త్వరలో నూన్‌ షోగా థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నాం’ అని దర్శక, నిర్మాత డా. భీమగాని సుధాకర్‌ గౌడ్‌ చెప్పారు. ఈ చిత్రానికి కథ మాటలు పాటలు, నిర్మాత, దర్శకుడు డా. భీమగాని సుధాకర్‌ గౌడ్‌, సంగీతం: వందేమాతరం శ్రీనివాస్‌, ఎడిటర్‌: నందమూరి హరి.

Subscribe for notification