డిఫరెంట్‌ ఎంటర్‌టైనర్‌

Written by RAJU

Published on:

డిఫరెంట్‌ ఎంటర్‌టైనర్‌ఈ సమ్మర్‌ సీజన్‌లో ప్రేక్షకులను నవ్వుల వర్షంతో ముంచెత్తేందుకు సిద్ధమైన రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ ‘వర్జిన్‌ బార్సు’ సినిమా రిలీజ్‌కు సిద్ధమైంది.
గీతానంద్‌-మిత్రా శర్మ హీరో, హీరోయిన్లుగా రాజ్‌ గురు ఫిలిమ్స్‌ పతాకంపై రాజా దరపునేని నిర్మాతగా, దయానంద్‌ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది.
సినిమా పోస్టర్‌ చూస్తుంటేనే దాని ఫన్‌ ఎలిమెంట్‌ ఏంటో అర్థమవుతుంది. ఓ అందమైన అమ్మాయి ముఖం, అందులో ఆమె పెదాలపై ముగ్గురు యువకులు విభిన్న శైలిలో కనిపించడం ఆకర్షణీయంగా ఉంది. పోస్టర్‌ చూస్తుంటే చాలా క్రేజీ వైబ్స్‌ వస్తున్నాయి. ఈ పోస్టర్‌లో అమ్మాయి పెదాలపై ఒకరు కలర్‌ఫుల్‌ షార్ట్స్‌లో, మరొకరు స్కేట్‌బోర్డ్‌తో, మరొకరు మ్యాగజైన్‌తో నవ్వుతూ కనిపించడం ఈ సినిమా తాలూకా కామెడీ ఎలిమెంట్‌ని సూచిస్తోంది. ‘బ్రో.. ఆర్‌ యు వర్జిన్‌?’ అనే ట్యాగ్‌లైన్‌ ఈ సినిమా రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైన్‌మెంట్‌గా రూపొందుతోందని తెలుస్తోంది. ఈ సమ్మర్‌లో విడుదల కానున్న ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయం సాధిస్తుందని అంచనా వేస్తున్నారు. యువతీ యువకుల మధ్య నడిచే రొమాన్స్‌, కామెడీ, ఎమోషన్స్‌తో కూడిన ఈ సినిమా థియేటర్లలో మరింత ఉత్సాహాన్ని రేకెత్తించే అవకాశం ఉంది. త్వరలో రిలీజ్‌ డేట్‌ పై క్లారిటీ రానుంది. శ్రీహన్‌, రోనీత్‌, జెన్నీఫర్‌, అన్షుల, సుజిత్‌ కుమార్‌, బబ్లు, అభిలాష్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి డైరెక్టర్‌: దయానంద్‌, ప్రొడ్యూసర్‌ : రాజా దరపునేని, మ్యూజిక్‌ డైరెక్టర్‌: స్మరణ్‌ సాయి, ఎడిటర్‌ : మార్తాండ్‌ కె వెంకటేష్‌. డీఓపి : వెంకట ప్రసాద్‌.

Subscribe for notification
Verified by MonsterInsights