Apprentice Recruitment 2025 : డిగ్రీ ఉత్తీర్ణులై బ్యాంక్ ఉద్యోగాలకు ప్రిపేరవుతున్న గుడ్‌న్యూస్. తాజాగా బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్రెంటిస్ ఖాళీల భర్తీకి ప్రకటనలు విడుదల చేశాయి.
హైలైట్:
- అప్రెంటిస్‌షిప్ రిక్రూట్‌మెంట్ 2025
- యూనియన్ బ్యాంక్, బీఓబీ ప్రకటనలు జారీ
- రెండింటిలో కలిపి 6691 ఖాళీల భర్తీ

బ్యాంక్ ఆఫ్ బరోడాలో 4000 ఖాళీలు :
- మొత్తం ఖాళీలు: 4000 (ఏపీ- 59, తెలంగాణ- 193)
- అర్హత: డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
- వయసు: ఫిబ్రవరి 1, 2025 నాటికి 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. (ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులకు గరిష్ఠ వయసులో సడలింపు ఉంటుంది)
- ఎంపిక: ఆన్‌లైన్ పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన, లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్టులతో అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
- స్టైపెండ్: మెట్రో/ అర్బన్ ప్రాంతాల్లో రూ.15,000 రూరల్/ సెమీ అర్బన్‌లో రూ.12,000 అందుకోవచ్చు.
- దరఖాస్తు విధానం : ఆన్‌లైన్ విధానంలో అప్లయ్ చేసుకోవాల్సి ఉంటుంది.
- దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యుఎస్ అభ్యర్థులు రూ.800.. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులు రూ.600.. దివ్యాంగ అభ్యర్థులు రూ.400 చెల్లించాల్సి ఉంటుంది.
- ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 11, 2025
- పూర్తి వివరాలకు వెబ్‌సైట్:https://www.apprenticeshipindia.gov.in/
యూనియన్ బ్యాంక్‌లో 2691 ఖాళీలు :
- మొత్తం ఖాళీల సంఖ్య: 2691 (ఆంధ్రప్రదేశ్- 549, తెలంగాణ- 304)
- అర్హత: డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
- వయసు: ఫిబ్రవరి 1, 2025 నాటికి 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. (ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులకు గరిష్ఠ వయసులో సడలింపు ఉంటుంది)
- ఎంపిక విధానం: ఆన్‌లైన్ పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన, లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్టుల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
- స్టైపెండ్: రూ.15,000 చెల్లిస్తారు.
- దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యుఎస్ అభ్యర్థులు రూ.800. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులు రూ.600. దివ్యాంగ అభ్యర్థులు రూ.400 చెల్లించాల్సి ఉంటుంది.
- దరఖాస్తు విధానం : ఆన్‌లైన్ విధానంలో అప్లయ్ చేసుకోవాల్సి ఉంటుంది.
- ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 5, 2025
- పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://www.unionbankofindia.co.in/en/home
ఎంపిక విధానం :
ఈ అప్రెంటిస్ పోస్టులకు సంబంధించి ఎంపిక పరీక్ష ఆన్‌లైన్ విధానంలో నిర్వహిస్తారు. ఈ పరీక్ష 100 మార్కులకు ఉంటుంది. ఇందులో జనరల్/ ఫైనాన్షియల్ అవేర్‌నెస్, జనరల్ ఇంగ్లిష్, క్వాంటిటేటివ్ అండ్ రీజనింగ్ ఆప్టిట్యూడ్, కంప్యూటర్ నాలెడ్జ్ విభాగాల నుంచి ఒక్కో సెక్షన్‌లో 25 చొప్పున 100 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష వ్యవధి 60 నిమిషాలు. ప్రతి సరైన జవాబుకు ఒక మార్కు ఉంటుంది. నెగిటివ్ మార్కులు లేవు. ఈ పరీక్షలో అర్హత సాధించడానికి విభాగాల వారీ కనీస మార్కులు పొందాలనే నిబంధన లేదు. మొత్తం మీద కనీస అర్హత మార్కులు సాధించిన వారికి అవకాశం కల్పిస్తారు. ఈ అర్హత మార్కులు ఎంత అనే విషయాన్ని బ్యాంకులు నిర్ణయిస్తాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఈ అప్రెంటిస్ ఖాళీలకు దరఖాస్తు చేసుకుని, టెన్త్/ ఇంటర్‌లో తెలుగు ఒక సబ్జెక్టుగా ఉన్న వారు లాంగ్వేజ్ టెస్టు రాయాల్సిన అవసరం లేదు. అనంతరం ధ్రువపత్రాలు పరిశీలించి, వైద్య పరీక్షలు నిర్వహించి, అప్రెంటిస్‌గా ఎంపిక చేస్తారు.