Union Bank 2691 Apprentice Recruitment 2025 : యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీ అప్రెంటిస్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. వివరాల్లోకెళ్తే..
హైలైట్:
- యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2025
- 2691 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి ప్రకటన విడుదల
- మార్చి 5 దరఖాస్తులకు చివరితేదీగా నిర్ణయం

రాష్ట్రాల వారిగా అప్రెంటిస్ ఖాళీలు : 2691
- తెలంగాణ- 304
- ఆంధ్రప్రదేశ్- 549
- కర్ణాటక- 305
- తమిళనాడు- 122
- కేరళ- 118
- ఒడిశా- 53
- మహారాష్ట్ర- 296
ఇతర ముఖ్యమైన సమాచారం :
- అర్హత: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీలో ఉత్తీర్ణత ఉండాలి.
- వయోపరిమితి: 2025 ఫిబ్రవరి 1వ తేదీ నాటికి 20 నుంచి 28 ఏళ్లు ఉండాలి. రిజర్వేషన్ల ఆధారంగా వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
- స్టైపెండ్: ఎంపికైన వారికి నెలకు రూ.15,000 ఉండాలి.
- దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
- ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా ఈ ఖాళీలకు ఎంపిక చేయనున్నారు.
- దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 5, 2025
BOB : బ్యాంక్ ఆఫ్ బరోడాలో 518 ఉద్యోగాలు
Bank of Baroda Recruitment 2025 : బ్యాంక్ ఆఫ్ బరోడా రెగ్యులర్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. BOB నోటిఫికేషన్ ద్వారా మొత్తం 518 ఖాళీలను భర్తీ చేయనుంది. పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ, బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంసీఏ, సీఏ, సీఎఫ్‌ఏ, ఎంబీఏలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో (Apply Online) అప్లయ్ చేసుకోవాల్సి ఉంటుంది. మార్చి 11 దరఖాస్తులకు చివరితేది. అభ్యర్థులు నోటిఫికేషన్ చెక్ చేసుకోవడానికి, పూర్తి వివరాలు తెలుసుకోవడానికి డైరెక్ట్ లింక్ ఇదే.