ప్రతి నెల 1వ తేదీన సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం ఠంచనుగా చేపడుతోంది. ఎక్కడా ఒక్క గంట కూడా ఆలస్యం కాకుండా.. పింఛన్లను పేదల చేతిలో పెట్టి.. వారి ముఖా ల్లో చిరునవ్వులు చూస్తోంది. తాజాగా ఏప్రిల్ 1వ తేదీని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా 64 లక్షల మందికి పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని బాబు సర్కారు చేపట్టింది.ఈ క్రమంలో మధ్యాహ్నం 1గంట సమయానికి 90 శాంతం పింఛన్లను ఠంచనుగా పంచేశారు.
ఇక, ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, నాయకులు, ఎమ్మెల్యేలు కూడా పాల్గొన్నారు. సీఎం చంద్ర బాబు ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని చిన్నగంజాం మండలం కొత్త గొల్లపాలెం గ్రామంలో `పేదల సేవలో పెన్షన్ల పంపిణీ` కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ.. మంచం లో ఉన్న వడ్లమూడి సుభాషిణి కి 15వేల రూపాయల పెన్షన్ పంపిణీ చేశారు. ఈ సమయంలో ఆమె ఆరో గ్యాన్ని పరామర్శించారు.
అయితే.. తమకు ఇల్లు లేదని సుభాషిణి కుటుంబం చెప్పడంతో ఆమె కుటుంబానికి గృహ నిర్మాణ శాఖ ద్వారా ఇంటిని మంజూరు చేస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇక, సుభాషిణి మాతృమూర్తికి ఒంటరి మహిళ పెన్షన్ మంజూరు చేస్తామని చెప్పారు. అదేవిధంగా సుభాషిణి చెల్లెలు భరణి చదువుకు న్నంత వరకు ప్రభుత్వం తరపున చదివిస్తామని మరో హామీ ఇచ్చారు. భరణి ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెద్ద అయినాక ఏమి కావాలనుకుంటున్నావు అని అడగాగ పోలీసు అవుతానని సమాధానం చెప్పడంతో సీఎం ఆమె అభీష్టాన్ని నెరవేరాలని ఆశీర్వదించారు.
90 శాతం పంపిణీ..
కాగా.. సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీ.. మధ్యాహ్నం 1గంటకే 90 శాతం పూర్తయినట్టు అధికారులు తెలి పారు. ఎండ వేడిమి కారణంగా.. సుదూర ప్రాంతాల్లోని ఇళ్లకు వెళ్లి ఇవ్వడం ఒకింత ఆలస్యమవుతోందని.. అయినప్పటికీ.. మధ్యాహ్నం 3గంటల సమయానికి 100 శాతం పూర్తి చేయాలన్న లక్ష్యాన్ని సాధిస్తామని చెప్పారు. కాగా.. గత నెలలో కొందరు సిబ్బంది.. ఇళ్లకు వెళ్లి.. పింఛన్లను పంపిణీ చేయలేదన్న విమర్శలు వచ్చాయి. అదేవిధంగా గుంటూరులో ఒక కార్యదర్శి.. 1.5 లక్షల రూపాయలను ఎత్తుకుపోయి.. ఆన్‌లైన్ గేమ్ ఆడేశాడు. ఈ నేపథ్యంలో ఈ సారి అలాంటి తప్పులు జరగకుండా.. అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు.
The post ఠంచనుగా పంచేశారు: దటీజ్ బాబు first appeared on namasteandhra.