సాఫ్ట్‌వేర్‌లో జాబ్ చేసే ప్రతి ఒక్కరికి భారీ ప్యాకేజ్‌తో పెద్ద జాబ్ కొట్టాలనే కల ఉంటుంది. కానీ ఆ జాబ్‌ను సాధించాలంటే ఫస్ట్ ఇంటర్వ్యూ క్రాక్ చేయాలి. ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. అయితే కొంత మంది ఈ ఇంటర్వ్యూలను ఈజీగా క్లియర్ చేస్తారు..కానీ కొందరూ చేయలేక ఇబ్బంది పడుతుంటారు. మోసం చేసైనా ఇంటర్వ్యూన్ క్రాక్ చేయాలనుకుంటారు. ఇలాంటివి ఈ మధ్య సినిమాల్లోనూ మనం చాలానే చూస్తున్నాం. అయితే ఇలా పెద్ద కంపెనీలలో జాబ్ చేయాలనుకునే వారి సమస్యను ఓ కుర్రాడు క్యాచ్ చేసుకున్నాడు. టెక్ కంపెనీలను ఇంటర్వ్యూలో మోసం చేసేందుకు ఓ AI యాప్‌ను కనిపెట్టాడు. దీంతో రూ.45 కోట్ల వరకు సంపాదించాడు.
కొలంబియా యూనివర్సిటీలో చదువుకున్న 21 ఏళ్ల విద్యార్థి చుంగిన్ “రాయ్” లీ అనే కుర్రాడు, టెక్ కంపెనీల ఇంటర్వ్యూలలో మోసం చేయడం కోసం “ఇంటర్వ్యూ కోడర్” అనే AI యాప్‌ను రూపొందించాడు. ఈ యాప్ లీట్‌కోడ్ వంటి కోడింగ్ ఇంటర్వ్యూలలో రియల్-టైమ్‌లో కోడ్ రాయడం, సమాధానాలు సూచించడం, వివరణలు ఇవ్వడం వంటివి చేస్తుంది. అయితే ఈ యాప్ ఇన్ బ్రౌజర్‌గా పనిచేస్తుంది. దీంతో దీన్ని గుర్తించడం చాలా కష్టం. ఈ కుర్రాడు ఈ యాప్‌ని ఉపయోగించి అమెజాన్, మెటా, టిక్‌టాక్ వంటి కంపెనీల నుండి ఇంటర్న్‌షిప్ ఆఫర్లు సాధించినట్టు తెలుస్తోంది. ఈ ద్వారా ఇతను దాదాపు రూ.45 కోట్ల వరకు సంపాధించినట్టు తెలుస్తోంది. అయితే, ఈ యాప్‌ను ఉపయోగించి అమెజాన్ ఇంటర్వ్యూలో పాల్గొన్న వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో లీ కొలంబియా యూనివర్సిటీ నుండి సస్పెన్షన్‌కు గురయ్యాడు.
ఈ పోస్ట్ చూడండి…
Cluely is out. cheat on everything. pic.twitter.com/EsRXQaCfUI
— Roy (@im_roy_lee) April 20, 2025
అయితే ఈ కంపెనీల్లో ఆఫర్లు పొందడం తన ఉద్దేశం కాదని, లీట్‌కోడ్ ఇంటర్వ్యూ ప్రక్రియలోని లోపాలను బయటపెట్టడం కోసమే తాను ఈ యాప్‌ను రూపొందించినట్టు లీ చెప్పుకొచ్చాడు. అయితే ఈ యాప్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…