టెంకాయ చెట్టును ఢీకొన్న కారు | Automobile hits a banana tree

Written by RAJU

Published on:


ABN
, Publish Date – Mar 24 , 2025 | 02:15 AM

ఆంధ్ర, తమిళనాడు సరిహద్దులోని పన్నంగాడు వద్ద కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న టెంకాయ చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ముంబైలోని ఓ సంస్థలో పనిచేస్తున్న చెన్నై వేలచ్చేరికి చెందిన మహ్మద్‌ అవాజ్‌ కొద్ది రోజుల క్రితం ఇంటికి వచ్చారు. స్థానికంగా ఇంజనీరింగ్‌ చదువుతున్న స్నేహితులు యోగీశ్వరన్‌, బెంజిమన్‌, ఆలీయా బేగం, శ్రీమాన్‌, మాదేష్‌, సండ్రీన్‌ ఫాతిమా, దీనదయాళ్‌తో కలిసి ఆదివారం ఉదయం వరదయ్యపాళెం వద్దనున్న ఉబ్బలమడుగుకు అద్దె కారులో బయలుదేరారు. సరిహద్దులోని పన్నంగాడు వద్ద అతివేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న టెంకాయ తోపులోకి దూసుకెళ్లి.. ఓ చెట్టును ఢీకొంది.

టెంకాయ చెట్టును ఢీకొన్న కారు

చెట్టును ఢీకొని నుజ్జునుజ్జయిన కారు

-ఇద్దరు తమిళనాడువాసుల దుర్మరణం

— ఆరుగురికి తీవ్ర గాయాలు

-రాష్ట్ర సరిహద్దులో ప్రమాదం

తడ, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): ఆంధ్ర, తమిళనాడు సరిహద్దులోని పన్నంగాడు వద్ద కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న టెంకాయ చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ముంబైలోని ఓ సంస్థలో పనిచేస్తున్న చెన్నై వేలచ్చేరికి చెందిన మహ్మద్‌ అవాజ్‌ కొద్ది రోజుల క్రితం ఇంటికి వచ్చారు. స్థానికంగా ఇంజనీరింగ్‌ చదువుతున్న స్నేహితులు యోగీశ్వరన్‌, బెంజిమన్‌, ఆలీయా బేగం, శ్రీమాన్‌, మాదేష్‌, సండ్రీన్‌ ఫాతిమా, దీనదయాళ్‌తో కలిసి ఆదివారం ఉదయం వరదయ్యపాళెం వద్దనున్న ఉబ్బలమడుగుకు అద్దె కారులో బయలుదేరారు. సరిహద్దులోని పన్నంగాడు వద్ద అతివేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న టెంకాయ తోపులోకి దూసుకెళ్లి.. ఓ చెట్టును ఢీకొంది. కారు నుజ్జునుజ్జు అయింది. డ్రైవింగ్‌ చేస్తున్న మహ్మద్‌ అవాజ్‌ వెనుక కూర్చొన్న సండ్రీన్‌ ఫాతిమా(21) అక్కడిక్కడే మృతి చెందారు. తీవ్రగాయాలైన మిగిలిన ఏడుగురిని ఎలావూరు ఆస్పత్రికి.. తర్వాత చెన్నైలోని స్టాండ్లీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ దీనదయాళ్‌(34) మృతి చెందారు. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. సూళ్లూరుపేట సీఐ మురళీకృష్ణ, ఎస్‌ఐ కొండప్ప నాయుడు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. సండ్రీన్‌ ఫాతిమా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సూళ్లూరుపేట ప్రభుత్వాస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Updated Date – Mar 24 , 2025 | 02:15 AM

Google News

Subscribe for notification