పరుగుల యంత్రం, ఛేజ్ మాస్టర్‌గా పేరుగాంచిన విరాట్ కోహ్లీ రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్నాడు. ఐపీఎల్ (IPL) 2025లో అతను బ్యాట్‌తో పరుగుల వర్షం కురిపిస్తున్నాడు. ఏప్రిల్ 13న జైపూర్‌లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ తన పేరు మీద మరో రికార్డును నమోదు చేసుకున్నాడు. టీ20 మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ సాధించడం ద్వారా ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ డేవిడ్ వార్నర్ రికార్డును సమం చేశాడు. కొన్ని రోజుల క్రితం, విరాట్ కోహ్లీ టీ20 క్రికెట్లో 13000 పరుగులు పూర్తి చేశాడు. అలా చేసిన మొదటి భారతీయుడిగా నిలిచాడు. తాజాగా తన హాఫ్ సెంచరీలతో మరో అద్భుతం చేశాడు.
టీ20ల్లో హాఫ్ సెంచరీలు సాధించిన తొలి భారత ఆటగాడిగా విరాట్ కోహ్లీ నిలిచాడు. రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ వనిందు హసరంగా బౌలింగ్‌లో అద్భుతమైన సిక్స్ కొట్టడం ద్వారా విరాట్ తన 100వ టీ20 హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. కోహ్లీ ఇప్పుడు ప్రపంచంలో రెండవ బ్యాట్స్‌మన్‌గా, టీ20 క్రికెట్లో 100 లేదా అంతకంటే ఎక్కువ హాఫ్ సెంచరీలు సాధించిన మొదటి భారతీయ బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు.
విరాట్ కోహ్లీకి ముందు, ఆస్ట్రేలియాకు చెందిన డేవిడ్ వార్నర్ మాత్రమే ఈ ఘనత సాధించాడు. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 45 బంతుల్లో 62 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇందులో 2 సిక్సర్లు, 4 ఫోర్లు ఉన్నాయి.
ఐపీఎల్లో విరాట్ కోహ్లీకి ఇది 66వ హాఫ్ సెంచరీ. ఈ విషయంలో డేవిడ్ వార్నర్‌తో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత శిఖర్ ధావన్ వంతు వస్తుంది. అతను 53 అర్ధ సెంచరీలు సాధించాడు. విరాట్ కోహ్లీ తన 405వ టీ20 మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు. అతను 405 మ్యాచ్‌ల్లో 387 ఇన్నింగ్స్‌ల్లో 13134 పరుగులు చేశాడు. ఇందులో 9 సెంచరీలు, 100 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఈ సీజన్లో కోహ్లీ బ్యాట్ నుంచి పరుగుల వర్షం కురుస్తోంది. ఈ సీజన్లో అతను 6 మ్యాచ్‌లలో 6 ఇన్నింగ్స్‌లలో 61.00 సగటుతో 248 పరుగులు చేశాడు. ఇందులో మూడు అర్ధ సెంచరీలు ఉన్నాయి.
ఐపీఎల్లో అత్యధిక సెంచరీలు, పరుగులు చేసిన ఆటగాడిగా కింగ్ కోహ్లీ నిలిచాడు. అతను 256 మ్యాచ్‌ల్లో ఎనిమిది సెంచరీలతో 8168 పరుగులు చేశాడు. కోహ్లీ 405 మ్యాచ్‌ల్లో 387 ఇన్నింగ్స్‌ల్లో 13134 పరుగులు చేశాడు. ఇందులో 9 సెంచరీలు, 100 అర్ధ సెంచరీలు ఉన్నాయి. కోహ్లీ ఇప్పటివరకు ఐపీఎల్లో 258 మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో అతను 39.09 సగటుతో 8248 పరుగులు చేశాడు. ఇందులో 8 సెంచరీలు, 58 అర్ధ సెంచరీలు ఉన్నాయి. అదే సమయంలో టీ20 అంతర్జాతీయ క్రికెట్లో, విరాట్ 125 మ్యాచ్‌ల్లో 137.04 స్ట్రైక్ రేట్, 48.69 సగటుతో 4188 పరుగులు చేశాడు. వీటిలో 1 సెంచరీ, 38 అర్ధ సెంచరీలు ఉన్నాయి.