TGPSC Group 2 Result 2025 Date : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 పరీక్ష ప్రిలిమినరీ ఆన్సర్ కీ ఇప్పటికే అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేసింది. అభ్యంతరాల గడువు జనవరి 22తో ముగియనుంది.

మరోవైపు ఈ TGPSC Group 2 ఫలితాలను విడుదల చేయడానికి TGPSC కమిషన్ ఏర్పాట్లు చేస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. టీజీపీఎస్సీ గ్రూప్ 2 ఫలితాలు మార్చి 11న విడుదల చేయనుట్లు టీజీపీఎస్సీ ప్రకటించింది. మొదట టీజీపీఎస్సీ గ్రూప్ 3 ఫలితాలు విడుదల చేయనున్నట్లు సమాచారం. ఈ TGPSC గ్రూప్ 3 ఫలితాలు జనవరి నెలాఖరులో విడుదలయ్యే అవకాశం ఉంది. అనంతరం TGPSC గ్రూప్ 2 ఫలితాలను విడుదల చేయనున్నట్లు ప్రాథమిక సమాచారం. త్వరలో ఈ అంశంపై అధికారికంగా స్పష్టత రానుంది.
TSPSC Group 2 Cut Off Marks (Expected)
TSPSC గ్రూప్ 2 పరీక్షలో మొత్తం 4 పేపర్‌లు ఉన్నాయి. అందులో ఒక్కో పేపర్‌కు 150 మార్కులు ఉన్నాయి. అంటే పరీక్ష మొత్తం మార్కులు 600. పరీక్షలో విజయం సాధించినట్లు ప్రకటించడానికి ఒక అభ్యర్థి కటాఫ్ మార్కులు లేదా అంతకంటే ఎక్కువ పొందాలి. TSPSC విడుదల చేసిన TGPSC గ్రూప్ 2 సర్వీసెస్ నోటిఫికేషన్ ప్రకారం.. ఓపెన్ కేటగిరీకి చెందిన అభ్యర్థికి ప్రతి పేపర్‌లో కనీస అవసరం 40 శాతం స్కోర్, వెనుకబడిన తరగతుల వ్యక్తులకు కనీస అవసరం 35 శాతం, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు 30 శాతం స్కోర్ సాధించాల్సి ఉంటుంది. ఈసారి కటాఫ్ మార్కులు ఈ విధంగా ఉండొచ్చని అంచనా..
- OC: 460- 470
- BC: 455- 465
- SC: 440- 450
- ST: 442- 447
- PH: 416- 425
మరోవైపు గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలను సైతం ఫిబ్రవరి ప్రారంభంలో విడుదల చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రూప్ 1 నియామక ప్రక్రియను మార్చి నెలాఖరులోపు పూర్తి చేస్తామని వెల్లడించిన విషయం తెలిసిందే. అందుకు అనుగుణంగా టీజీపీఎస్సీ కమిషన్ కార్యాచరణ ఉండే అవకాశం ఉంది.