గతంలోనే హింట్స్
త్వరలో తాము విధించబోయే ఔషధ సుంకాలు ఎంత ఎక్కువగా ఉంటాయో గత ఫిబ్రవరిలోనే ట్రంప్ సంకేతాలు ఇచ్చారు. కనీసం 25% లేదా అంతకన్నా ఎక్కువే ఉండొచ్చని, ఒక సంవత్సరం కాలంలో చాలా గణనీయంగా పెరుగుతాయని హెచ్చరించారు. కాగా, తాజాగా ట్రంప్ చేసిన ఔషధ సుంకాల ప్రకటన ఫార్మా ఉత్పత్తులను భారీగా అమెరికాకు ఎగుమతి చేసే చైనా, భారత్ వంటి దేశాల ఫార్మా కంపెనీల ఆదాయాలపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది. ఈ నేపథ్యంలో, ఆయా దేశాల్లోని ఫార్మా, ఫార్మా సంబంధిత కంపెనీల స్టాక్స్ భారీగా నష్టపోతున్నాయి.