JEE Main 2025 Session 2 Result : జేఈఈ మెయిన్ సెషన్ 2 ప్రిలిమినరీ ఆన్సర్ కీ ఇప్పటికే విడుదలైంది. ఇక ఫలితాల విడుదలకు ఎన్‌టీఏ ఏర్పాట్లు చేస్తోంది. వివరాల్లోకెళ్తే..
Samayam Teluguజేఈఈ మెయిన్ సెషన్ 2 రిజల్ట్ 2025JEE Main Session 2 Result 2025 Date : దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ విద్యాసంస్థలైన ఎన్‌ఐటీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి గాను బీటెక్, బీఆర్క్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి నిర్వహించిన జేఈఈ మెయిన్ 2025 సెషన్ 2 పరీక్షలు ఇటీవల ముగిసిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలు ఏప్రిల్ 2 నుంచి 9వ తేదీ వరకు జరిగాయి. ఏప్రిల్ 2, 3, 4, 7, 8 తేదీల్లో పేపర్-1 (బీఈ/ బీటెక్) పరీక్షలు జరుగగా.. ఏప్రిల్ 9వ తేదీన పేపర్-2ఏ, 2బీ (బీఆర్క్/ బీ ప్లానింగ్) ప్రవేశ పరీక్షలు జరిగాయి. అయితే ఈ తేదీల్లో సీబీఎస్సీ బోర్డు పరీక్షలు రాసి విద్యార్ధులకు ప్రత్యేకంగా మరోమారు జేఈఈ మెయిన్ పరీక్షలు ఎన్టీయే నిర్వహించింది. ఈ పరీక్షల ప్రాథమిక ఆన్సర్ కీ విడుదలైంది.
అయితే.. బీఈ/ బీటెక్ ప్రవేశాల కోసం Joint Entrance Examination JEE Main పేపర్-1 పరీక్ష రాసిన అభ్యర్థులు ప్రాథమిక కీపై అభ్యంతరాలను ఏప్రిల్ 13వ తేదీ వరకు స్వీకరించింది. అభ్యంతరాల స్వీరణ అనంతరం ఫైనల్ ఆన్సర్ కీ తయారు చేసి, ఆ వెనువెంటనే ఫలితాలను కూడా విడుదల చేయనున్నారు. ఏప్రిల్ 17న జేఈఈ మెయిన్ సెషన్ 2 ఫలితాలు విడుదల చేయనున్నారు. ఈ ఫలితాల విడుదల అనంతరం జేఈఈ మెయిన్ రెండు సెషన్లలో బెస్ట్ స్కోర్ చేసిన తొలి 2.5 లక్షల మందిని సెలక్ట్ చేసి జేఈఈ అడ్వాన్స్‌డ్ 2025 పరీక్ష రాసేందుకు అనుమతిస్తారు. జేఈఈ అడ్వాన్స్‌డ్ 2025 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు ఏప్రిల్ 23 నుంచి ప్రారంభం కానున్నాయి. విద్యార్థులు పూర్తి వివరాలను అధికారిక వెబ్‌సైట్ ద్వారా చెక్ చేసుకోవచ్చు.
రచయిత గురించికిషోర్ రెడ్డికిషోర్ రెడ్డి డైనమిక్ రైటర్, డిజిటల్ మీడియా ప్రొఫెషనల్. ఈ రంగంలో 6.8 సంవత్సరాల అనుభవం ఉంది. అతను డిజిటల్ మీడియాలో తన ప్రస్థానం ప్రారంభించినప్పటి నుంచి రాజకీయ, సినిమా, విద్య, ఉద్యోగాలు సహా అనేక విభాగాలను నిర్వహించడంలో గణనీయమైన నైపుణ్యాన్ని పొందారు.
రాయడంలో అతనికున్న అభిరుచి, కరెంట్ అఫైర్స్‌పై లోతైన జ్ఞానంతో కిషోర్ ఈ పరిశ్రమలో తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నారు. విభిన్న విభాగాలలోని పాఠకులకు ఆకర్షణీయమైన సందేశాత్మక కంటెంట్‌ను రూపొందించారు. ప్రస్తుతం అతను పనిచేస్తున్న విభాగంలో.. 4.5 ఏళ్లుగా నిర్దిష్ట విభాగాన్ని నిర్వహిస్తున్నారు. అతను వ్యూవర్స్‌కు నచ్చే అత్యంత నాణ్యమైన కంటెంట్‌ను స్థిరంగా అందిస్తున్నారు.
కిషోర్ ఖాళీగా ఉన్నప్పుడు పుస్తకాలు చదవడం, ప్రముఖుల ఇంటర్వ్యూలు చూడటం వంటివి చేస్తుంటారు. ఈ పనులు తనను రిలాక్స్ చేస్తాయని, క్రియేటివిటీని రీఛార్జ్ చేస్తాయని అతను నమ్ముతున్నాడు.… ఇంకా చదవండి