జాగ్రత్తగా మాట్లాడు.. జ‌గ‌న్ కు రామగిరి ఎస్సై స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

Written by RAJU

Published on:

శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో హత్యకు గురైన వైసీపీ కార్యకర్త లింగమయ్య కుటుంబాన్ని మంగళవారం వైఎస్ జగన్ పరామర్శించిన సంగతి తెలిసిందే. లింగమయ్య కుటుంబాన్ని కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ జ‌గ‌న్ మరోసారి పోలీసులను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో పోలీసులు తమ టోపీ మీద ఉన్న సింహాలకు సెల్యూట్ చేయడం మానేసి చంద్రబాబు వాచ్మెన్లుగా పని చేస్తున్నారంటూ జగన్ చిందులు తొక్కారు.

త్వరలో అధికారంలోకి రాబోది ఆ పార్టీనే.. ఆ రోజు తమ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసుల్ని బనాయించి వేధిస్తున్న మీ బట్టలూడదీస్తాం.. యూనిఫామ్ విప్పించి నిలబెడతాం.. ఉద్యోగాలు లేకుండా చేస్తాం అంటూ జ‌గ‌న్ పోలీసుల‌కు హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. అయితే జ‌న‌గ్ వ్యాఖ్య‌ల ప‌ట్ల రామగిరి ఎస్సై సుధాకర్ యాదవ్ సీరియ‌స్‌గా రియాక్ట్ అయ్యారు. జ‌గ‌న్ కు స్ట్రోంగ్ కౌంట‌ర్ ఇస్తూ ఒక వీడియోను వ‌దిలారు.

`పోలీసులను బట్టలు ఊడదీసి కొడతా అంటున్నావ్. పోలీలుసులు నువ్వు ఇస్తే వేసుకున్న యూనిఫాం అనుకున్నావా..? కష్టపడి చదివి, పరుగు పందెంలో పాసై, వేలమంది పాల్గొన్న పరీక్షల్లో నెగ్గి వేసుకున్న యూనిఫాం ఇది. నువ్వెవడో వచ్చి యూనిఫాం ఊడదీస్తా అంటున్నావ్. ఊడదీయడానికి ఇది అరటితొక్క కాదు. మేము నిజాయితీగా ఉన్నాం. నిజాయితీగా ప్ర‌జ‌ల ప‌క్ష‌నా నిల‌బ‌డతాం. నిజాయితీగా ఉద్యోగం చేస్తాం. నిజాయితీగానే చ‌స్తాం. అంతేత‌ప్ప అడ్డ‌మైన దారులు తొక్కం. జాగ్ర‌త్త‌గా మాట్లాడు` అంటూ జ‌గ‌న్ ను ఉద్ధేశించి ఎస్సై సుధాకర్ యాదవ్ తీవ్రంగా ప్రతిస్పందించారు. అదే విధంగా కిందిస్థాయి ఉద్యోగులను భయపెడితే ప్రజాస్వామ్యానికే ముప్పు అని.. ద‌య‌చేసి త‌మ‌ ఉద్యోగులకు భరోసా కల్పించాలని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంమంత్రి, డీజీపీలను ఈ సంద‌ర్భంగా సుధాక‌ర్ యాద‌వ్ కోరారు.

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights