జస్టిస్‌ రవినాథ్‌ తిలహరికి ఘన స్వాగతం

Written by RAJU

Published on:

మచిలీపట్నం టౌన్‌, మార్చి 22(ఆంధ్రజ్యోతి): బెల్‌ అతిథి గృహానికి విచ్చేసిన హైకో ర్టు న్యాయమూర్తి, కృష్ణాజిల్లా పోర్టుఫోలియో న్యాయమూర్తి జస్టిస్‌ రవినాథ్‌ తిలహరికి శనివారం ఉదయం కలెక్టర్‌ డీకే బాలాజీ, ఎస్పీ ఆర్‌.గంగాధరరావు ఘన స్వాగతం పలికారు. మొక్కలు అందజేశారు. జిల్లా కోర్టు న్యాయమూర్తి చిన్నంశెట్టి రాజు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.వి.రామకృష్ణయ్య, విజయవాడ మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ న్యా యాధికారి ఎ.సత్యానంద్‌, శ్రీదేవి, ఏఎస్పీ సత్యనారాయణ, డీఎస్పీ రాజా, తహసీల్దార్‌ మధుసూదనరావు, ఆర్డీవో స్వాతి, మచిలీపట్నం న్యాయస్థానాల ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సీహెచ్‌వీ ప్రసాద్‌, ప్రధాన కార్యదర్శి ఎ.వేణు తదితరులు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.

బందరులో అదనపు కోర్టులు ఏర్పాటు చేయాలి

జస్టిస్‌ రవినాథ్‌ తిలహరికి బార్‌ అసోసియేషన్‌ వినతి

మచిలీపట్నం టౌన్‌: మచిలీపట్నంలో అదనపు కోర్టులను ఏర్పాటు చేయాలని హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా పోర్టుఫోలియో న్యాయమూర్తి జస్టిస్‌ రవినాథ్‌ తిలహరికి బెల్‌ గె్‌స్టహౌ్‌సలో బార్‌ అసోసియేషన్‌ నేత లు వినతిపత్రం అందించారు. మచిలీపట్నం జిల్లా కోర్టులో కో ఆపరేటివ్‌ ట్రైబ్యునల్‌, ఫ్యామిలీ, ఏసీబీ, కమర్షియల్‌, క్యాంపు కోర్టులు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. రవినాథ్‌ తిలహరిని కలిసిన వారిలో బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు బూరగడ్డ అశోక్‌కుమార్‌, ప్రధాన కార్యదర్శి సిద్ధినేని శ్రీసత్యసాయిబాబు, న్యాయవాదులు సోడిశెట్టి బాలాజీ, అజ్మతున్నీసా, అడపా మురళి, కమ్మిలి విజయకుమార్‌, లంకిశెట్టి బాలాజీ ఉన్నారు.

Updated Date – Mar 23 , 2025 | 01:35 AM

Subscribe for notification