జర్నలిస్టులుగా అసభ్య పదజాలం వాడొచ్చా? | CM Revanth Reddy PR Officer Questions Rajdeep Sardesai on Use of Offensive Language

Written by RAJU

Published on:


ABN
, Publish Date – Mar 14 , 2025 | 05:50 AM

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి అసభ్య పదజాలాన్ని వాడే హక్కు జర్నలిజం ఇచ్చిందా అంటూ సీనియర్‌ జర్నలిస్ట్‌ రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌ను సీఎం సీపీఆర్‌ఓ బోరెడ్డి అయోధ్యరెడ్డి ప్రశ్నించారు.

జర్నలిస్టులుగా అసభ్య పదజాలం వాడొచ్చా?

  • రేవంత్‌పై జర్నలిస్టుల వీడియో… సీపీఆర్‌ఓ అయోధ్యరెడ్డి అభ్యంతరం

  • రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌ను ట్యాగ్‌ చేస్తూ ప్రశ్నలు

హైదరాబాద్‌, మార్చి 13 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి అసభ్య పదజాలాన్ని వాడే హక్కు జర్నలిజం ఇచ్చిందా అంటూ సీనియర్‌ జర్నలిస్ట్‌ రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌ను సీఎం సీపీఆర్‌ఓ బోరెడ్డి అయోధ్యరెడ్డి ప్రశ్నించారు. అసభ్య పదాలను మౌఖికంగాగాని, రాత పూర్వకంగాని వినియోగిస్తామా అని నిలదీశారు. సీఎం రేవంత్‌ను తిడుతున్న వీడియోను పోస్ట్‌ చేసిన కేసులో రేవతి, తన్వీ అనే జర్నలిస్టులను అరెస్ట్‌ చేయడాన్ని ఎడిటర్స్‌ గిల్డ్‌ ఖండించిన విషయం తెలిసిందే. దీని స్పందనను సీనియర్‌ జర్నలిస్టు రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌ తన ఎక్స్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేశారు.

సీఎం రేవంత్‌, రాహుల్‌గాంధీ, జైరాం రమేశ్‌లను ట్యాగ్‌ చేశారు. దీనిపై రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌ను ఉద్దేశించి సీఎం రేవంత్‌రెడ్డి ప్రజా సంబంధాల ప్రధాన అధికారి బోరెడ్డి అయోధ్యరెడ్డి ‘ఎక్స్‌’ వేదికగా స్పందించారు. జర్నలిస్టులుగా ప్రశ్నలడిగే అవకాశం ఉంటుంది కానీ… సీఎం రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి వారు వాడిన పదాలను విన్నారా అంటూ.. ఇలాంటి పదాలను ఆంగ్లంలోకి అనువదించి చానెల్‌లో ప్రసారం చేయగలరా అని అయోధ్యరెడ్డి ప్రశ్నించారు.

Updated Date – Mar 14 , 2025 | 05:50 AM

Google News

Subscribe for notification