వైసీపీ అధినేత జగన్.. శ్రీసత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం పర్యటనలో పోలీసులపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. వైసీపీ నాయకులను వేధించే పోలీసుల యూనిఫాంను ఊడదీయిస్తానని ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పార్టీ నేత లింగమయ్య ఇటీవల హత్యకు గురయ్యారు. ఆయన కుటుంబాన్ని జగన్ పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే.. జగన్ ఇలా పోలీసులపై నోరు చేసుకోవడం ఇదే తొలిసారి కాదు. గతంలో వైసీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పరామర్శించినప్పుడు కూడా నోరు పారేసుకున్నారు.
టీడీపీ నేత సత్యవర్థన్‌ను అపహరించి, బెదిరించారన్న కేసులో వంశీని విజయవాడ పోలీసులు అరెస్టు చేసి జిల్లా జైలుకు తరలిం చారు. ఈ క్రమంలో విజయవాడ జైల్లో ఉన్న వంశీని జగన్ పరామర్శించారు. ఈ సందర్భంగా కూడా.. పోలీసులపై ఆయన వివా దాస్పద వ్యాఖ్యలు చేశారు. “సప్త సముద్రాల అవతల దాక్కున్నా పోలీసులను వదిలి పెట్టేది లేదు.. ఈడ్చుకొచ్చి మరీ చర్యలు తీసుకుంటాం“ అని జగన్ వ్యాఖ్యానించారు. దీనిపై అప్పట్లో పోలీసు అధికారుల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. జగన్ తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని.. పోలీసుల భద్రత లేకుండా.. బయటకు రాగలరా? అంటూ.. నిలదీసింది.
కట్ చేస్తే.. కొన్నాళ్ల గ్యాప్ తర్వాత.. జగన్ మరోసారి నోరు చేసుకున్నారు. అయితే.. తాజాగా వ్యాఖ్యలపై టీడీపీ కీలక నేతలు స్పందించారు. జగన్‌కు ఘాటు రిప్లయ్ ఇచ్చారు. “జగన్ ఫక్తు రౌడీగా మాట్లాడుతున్నాడు“ అని టీడీపీ రాష్ట్ర చీఫ్ పల్లా శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. “జగన్ వీధి రౌడీలా మాట్లాడుతున్నాడు. చిల్లర మాటలు మానుకోవాలి. ప్రజలు గత ఏడాదే వైసీపీ బట్టలూడదీసి జగన్‌ను నడిరోడ్డుపై నిలబెట్టారు. ముందు ఆ విషయంపై అంతర్మథనం చేసుకోవాలి. ఇలా ఎందుకు ప్రజలు బుద్ధి చెప్పారో తెలుసుకోవాలి“ అని పల్లా అన్నారు.
ఇక, మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ.. జగన్‌కు అనంతపురం జిల్లావెళ్లే అర్హత లేదని అన్నారు. పోలీసుల భద్రత లేకుండా..జగన్ క్షణం కూడా బయట తిరగలేడని.. అలాంటి పోలీసులపై నోరు పారేసుకోవడం చూస్తే.. జగన్ అసమర్థత కనిపి స్తోందని వ్యాఖ్యానించారు. ప్రజలు తనకు అధికారం దక్కకుండా చేశారన్న అక్కసు ఆయనలో ఉందని వ్యాఖ్యానించారు. జగన్ తన తీరు మార్చుకోకపోతే.. ప్రజలు మరోసారి బట్టలు ఊడదీస్తారని వ్యాఖ్యానించారు. సత్యసాయి జిల్లా రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత కూడా.. జగన్‌పై ఫైరయ్యారు. పోలీసులపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
The post జగన్ యాక్షన్… టీడీపీ అదిరిపోయే రియాక్షన్! first appeared on namasteandhra.