– ఇద్దరు మావోయిస్టులు మృతి
-ఈ ఏడాదిలో 140 మంది హతం
-అందులో 120 మంది బస్తర్‌లోనే
నవతెలంగాణ-చర్ల
ఛత్తీస్‌గఢ్ దండకారణ్యం లో మావోయిస్టులు, భద్రతా దళాల మధ్య మరోసారి ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు మావోయి స్టులు మృతి చెందారు. బస్తర్ రేంజ్ ఐజీ పి. సుందర్ రాజ్ తెలిపిన వివరాల ప్రకారం.. కొండగావ్-నారాయణ్‌పూర్ సరిహద్దులోని కిలాం-బార్గమ్ గ్రామా ల అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలు ఉన్నాయన్న సమా చారంతో డీఆర్‌జీ, బస్తర్ ఫైటర్స్, రాష్ట్ర పోలీసులు సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో భద్రతా బలగాలపై మావోయిస్టులు కాల్పులు జరప డంతో భద్రతా సిబ్బంది ఎదురుకాల్పులు జరిపారు. దాంతో మావోయిస్టులు అక్కడి నుంచి పరారయ్యారు. ఆనంతరం అక్కడ భద్రతా దళాలు గాలింపు చర్యలు చేపట్టగా, రెండు మృత దేహాలు, ఏకే-47, రైఫిల్, ఇతర ఆయుధాలు, భారీగా పేలుడు పదా ర్ధాలను స్వాధీనం చేసుకున్నాయి. కాగా, మృతిచెందిన మావోయిస్టు లను తూర్పు బస్తర్ డివిజన్ సభ్యులు హల్దార్, ఏరియా కమిటీ సభ్యులు రామేగా గుర్తించారు. వీరిలో హల్దార్‌పై రూ.8లక్షలు, రామేపై రూ.5లోల రివార్డు ఉన్నట్టు పోలీసులు తెలిపారు. అక్కడ ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నా యని తెలిపారు.
ఈ ఏడాదిలో 140కి చేరిన మృతుల సంఖ్య
దీంతో ఈ ఏడాది ఎన్‌కౌంటర్లలో మరణించిన మావోయిస్టుల సంఖ్య 140కి చేరింది. వారిలో 123 మంది బస్తర్ ప్రాంతంలోనే ఉండటం గమనార్హం. మరోవైపు కొండగావ్, బస్తర్ జిల్లాలను ‘మావోయిస్టుల నుంచి విముక్తి’ చేస్తామని ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ విషయాన్ని గత డిసెంబర్‌లో కేంద్ర హౌంమంత్రి అమిత్ షాకు తెలిపింది.అయితే ఎన్‌కౌంటర్ల పేరిట బీజేపీ ప్రభుత్వం సృష్టిస్తున్న మారణహౌమంపై ప్రజాసంఘాలు, పౌర సమాజం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

ఛత్తీస్‌గఢ్ అడవుల్లో మరో ఎన్‌కౌంటర్

Written by RAJU
Published on: