నవతెలంగాణ ఆర్మూర్
పట్టణంలోని సిద్దుల గుట్టపై చిరుత పులి సంచారం వీడియో వైరల్ గా మారింది.. మంగళవారం ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఫారెస్టు సిబ్బంది సిద్దుల గుట్టను పరిశీలించినారు. చిరుత పులి ఉందని నిర్ధారించడానికి 2 ట్రాక్ కెమెరాలను ఫిక్స్ చేస్తున్నామన్నారు. ఆ తర్వాత చిరుత పులి ఎక్కడినుండి వస్తోంది? అనే విషయాలు తెలుస్తాయన్నారు. ఉన్నత అధికారుల సూచనల మేరకు తర్వాత చర్యలు చేపడతామన్నారు.సిద్దుల గుట్టను సందర్శించి నీటి జాడలను, పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించామన్నారు. ఫారెస్ట్ అధికారులతో పాటు ఆలయ కమిటీ సభ్యులు భారత్ గ్యాస్ సుమన్, ప్రశాంత్ గౌడ్, చరణ్ రెడ్డి, గంగా కిషన్ తదితరులు పాల్గొన్నారు.
– Advertisement –