చిన్న బోటుతో సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులు.. నడి మధ్యలో ఉండగా అమాంతంగా ఎగిరొచ్చిన..

Written by RAJU

Published on:

సముద్రంలో వేటకు వెళ్లిన ముగ్గురు మత్స్యకారుల ప్రయాణం గందరగోళంగా మారింది. నడి సముద్రంలో వారికి ఎదురైన సీన్‌తో ఒక్కసారిగా వారి గుండెలు ఆగిపోయేలా చేసింది. ఒక చిన్నపాటి బోటులో చేపల వేటకు వెళ్లిన వారికి ఎదురైంది మరోదే కాదు.. భారీ డాల్పిఫ్.. అవును 400కిలల బరువున్న డాల్ఫీన్‌ అమాంతంగా ఎగిరొచ్చి వారి బోటులోకి పడింది…ఆకాశం నుంచి ఏదో వింత వస్తువు తమ బోటుకి వచ్చిపడినట్టుగా సముద్ర జలాల్లోంచి గాల్లోకి ఎగిరిన డాల్ఫిన్‌ నేరుగా.. మత్స్యకారుల బోటులోనే పడింది.. ఇది ఎక్కడ జరిగింది..? ఆ తరువాత ఏం జరిగిందో పూర్తి వివరాల్లోకి వెళితే…

న్యూజిలాండ్‌కు చెందిన ముగ్గురు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లారు..వారు ప్రయాణిస్తున్న చిన్న చేపల బోటులోకి 400కిలోల డాల్ఫిన్‌ ఒక్కసారిగా ఎగిరి వచ్చి పడింది. ఆ సమయంలో ముగ్గురు మత్స్యకారులు బోటులోనే ఉన్నారు. గాల్లోంచి ఎగిరిపడ్డ డాల్ఫిన్‌ దాటికి ఆ ముగ్గురు మత్స్యకారుల్లో ఒకరికి స్వల్ప గాయాలయ్యాయి. డాల్ఫిన్‌ తాకిడికి పడవ తీవ్రంగా దెబ్బతింది. డాల్ఫిన్‌కు కూడా గాయాలయ్యాయి. అక్కడ ఏం జరిగిందో కాసేపు వారికి ఏమీ అర్థం కాలేదు.. డాల్ఫిన్‌ ఆకాశంలోంచి కిందపడిందా అనే సందేహంలోనే ఉండిపోయారు..

Dolphin Crash Lands

ఇవి కూడా చదవండి

మత్స్యకారులు వెళ్తున్న పడవ తీవ్రంగా దెబ్బతినటంతో న్యూజిలాండ్‌ కన్వర్సేషన్‌ ఏజెన్సీని సాయం కోరగా.. డాల్ఫిన్‌ సహా మత్స్యకారులను మరో బోటు ద్వారా తీరానికి చేర్చారు. ఆ సమయంలో డాల్ఫిన్‌ను తడిగా ఉంచడం కోసం వాటర్‌ ఫ్లష్‌ సాయంతో నీటిని చల్లారు. తీరం చేర్చాక డాల్ఫిన్‌కు వైద్యం అందించి తిరిగి సముద్రంలోకి వదిలేశారు..

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Subscribe for notification