చిన్నారులకు కంటి పరీక్షలు చేయాలి

Written by RAJU

Published on:

తంగళ్లపల్లి, ఏప్రిల్‌ 7 (ఆంధ్రజ్యోతి): అంగన్‌వాడీ కేంద్రాల్లో చదివే ప్రతి చిన్నారికి కంటి వైద్య పరీక్షలు చేయాలని కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా ఆదేశించారు. సోమవారం తంగళ్లపల్లి మండలంలోని బస్వాపూర్‌ అంగన్‌వాడీ కేంద్రలలో పిల్లల ఆరోగ్య స్మార్ట్‌చెక్‌ కార్య క్రమాన్ని కలెక్టర్‌ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని అంగన్‌వాడీ కేంద్రాల్లోని విద్యా ర్థులకు ప్రణాళిక ప్రకారం కంటి వైద్య పరీక్షలు నిర్వ హించాలని ఆదేశించారు. పిల్లలకు సంబంధించి తొమ్మి ది రకాల అంశాలను పరిశీలిస్తారని, తల్లిదండ్రులు వారి పిల్లల ఎదుగుదల, పెరుగుదల, నైపుణ్యాల విష యంలో ఎదుర్కొంటున్న అవాంతరాలను ఇబ్బందుల ను అంగన్‌వాడీ టీచర్‌ దృష్టికి తీసుకురావాలని సూచిం చారు. మధ్య సిబ్బంది ఏమైనా లోపాలుంటే గుర్తించి పిల్లలకు మందులు అందజేయాలని సూచించారు. ఇబ్బందిపడే విద్యార్థులకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం అందించడంతో పాటు శస్త్ర చికిత్సలకు సిఫార్సు చేశారని తెలిపారు. జిల్లాలోని ఆ ప్రతి ఆరు సంవత్స రాలలోపు పిల్లల ఉన్న తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్విని చేసుకోవాలన్నారు. సంక్షేమ అధికారి లక్ష్మీరాజం మాట్లాడుతూ అంగన్‌వాడీ సెంటర్లలోని నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని ప్రభు త్వం ఆదేశించిందని దానికి అను గుణంగా జిల్లా సంక్షేమ శాఖ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సంయు క్తంగా ఏర్పాట్లు చేసినట్లు తెలి పారు. ఈ కార్యక్రమాల్లో జిల్లా వైద్యాధికారి రజిత, వైద్యులు నయీమాజహా, సంపత్‌, ఉపాధ్యా యులు, సిబ్బంది, పాల్గొన్నారు.

పాఠశాల తనిఖీ..

తంగళ్లపల్లి మండలం బస్వా పూర్‌ గ్రామంలోని ప్రాథమిక పాఠ శాల, అంగన్‌వాడీ కేంద్రాన్ని కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల హాజరు శాతం, పాఠాలు బోధిస్తున్న తీరు, విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరును పరిశీలించారు.

Subscribe for notification
Verified by MonsterInsights