
నవతెలంగాణ -సుల్తాన్ బజార్
శ్రీ కమలాకర చారిటబుల్ ట్రస్ట్, కమలాకర లలిత కళాభారతి సాంఘిక సాహిత్య సాంస్కృతిక ఆధ్యాత్మిక సేవా సంస్థ ల సంయుక్త ఆధ్వర్యంలో సుల్తాన్ బజార్ లోని శ్రీకృష్ణదేవరాయ భాషా నిలయంలో విశ్వా వసు ఉగాది పురస్కారాల ప్రధాన ఉత్సవం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా న్యూఢిల్లీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి డాక్టర్ ఎస్ వేణుగోపాల చారి చేతుల మీదుగా సమాజ సేవ రత్న కందెపు రాజశేఖర్, సంగీత రత్న చింతలపాటి మూర్తి, సాహిత్య రత్న శైలజ మిత్ర, నాట్యరత్న డాక్టర్ నిర్మలాదేవి విశ్వేశ్వరమ్మ, ఆధ్యాత్మిక రత్న భారతి రంగరాజన్, కవిరత్న భారతి కృష్ణ లకు విశ్వావసు ఉగాది పురస్కారాలను ప్రధానం చేశారు. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో పూర్వ రిజిస్టార్ ఆచార్య టి గౌరీ శంకర్, రచయిత్రి డాక్టర్ వి కృష్ణకుమారి, ప్రముఖ కవి డాక్టర్ ఆచార్య ఫణీంద్ర కళాకారులు తదితరులు పాల్గొన్నారు.