నవతెలంగాణ-బెజ్జంకి: మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్‌రాం జయంతి వేడుకలను శనివారం మండల కేంద్రంలో ప్రజా సంఘాల నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. లక్ష్మిపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శి అనూష, మహిళ సంఘాల సభ్యులు, పారిశుధ్య కార్మికులు బాబు జగ్జీవన్‌రాం చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.