
అఖిల భారత కిసాన్ సభ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని మండల కేంద్రంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. రైతు సంఘం మండల అధ్యక్షుడు గుండు రామస్వామి జెండా ఆవిష్కరణ కావించారు. అనంతరం రామస్వామి మాట్లాడుతూ అఖిలభారత రైతు సంఘం 1936 ఏప్రిల్ 11న ప్రారంభించడం జరిగిందని తెలిపారు .నాటి నుండి నేటి వరకు అఖిలభారత కిసాన్ సభ ఆధ్వర్యంలో దేశవాప్తంగా అనేక ఉద్యమాలు జరిగాయని ఆయన అన్నారు. తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం మహారాష్ట్రలో వర్లి ఆదివాసీల తిరుగుబాటు బెంగాల్లో తేబాగ పోరాటం కేరళలో ఉన్నప్ర వాయిలార్ పోరాటం జరిగిందని ఆయన అన్నారు. ఇప్పటికి నేటి పాలకులు రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వకుండా రైతాంగాన్ని దగా చేస్తున్నారని రైతు వ్యతిరేక చట్టాలు తీసుకువచ్చి కార్పొరేట్లకు కట్టబెడుతున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా రైతుల ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు నిమ్మల బిక్షం, గుండు లెనిన్, కాప కోటేశ్వరరావు, సోమ మల్లారెడ్డి, సామా మహేష్, పొరబోయిన రాజయ్య, వేముల విజయ, తదితరులు పాల్గొన్నారు.