
మహాత్మ జ్యోతిబాపూలే జయంతి వేడుకలను శుక్రవారం మండల కేంద్రంలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి జంపాల చంద్రశేఖర్ జ్యోతిరావు పూలే కు ఘన నివాళులు అర్పించి మాట్లాడారు. కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన యోధుడు జ్యోతిబా పూలే అని స్త్రీల అభ్యున్నతికి, స్త్రీ విద్యకు కృషిచేసిన మహనీయులు అన్నారు.తొలి బాలికల పాఠశాలను ప్రారంభించిన విద్యావేత్త సమ సమాజ స్థాపన చేసిన మహానీయుడు జ్యోతిబా పూలే అని కొనియాడారు.ములుగు జిల్లా బీసీ సంక్షేమ శాఖ సంఘం అధ్యక్షులు చింతనిప్పుల భిక్షపతి ,జిల్లా బీసీ సంక్షేమ శాఖ సంఘం కార్యదర్శి మధు ,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పాలడుగు వెంకటకృష్ణ విచ్చేసి మహాత్మ జ్యోతిభా పూలే చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి వారు చేసినటువంటి సేవలను స్మరించుకున్నారు.ఈ కార్యక్రమంలో వారితో పాటు మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి తేళ్ల హరిప్రసాద్,ములుగు జిల్లా అధికార ప్రతినిధి జెట్టి సోమయ్య,జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి గనపాక సుధాకర్,మండల వర్కింగ్ ప్రెసిడెంట్ రసాపుత్ సీతారాం నాయక్,మహిళా కాంగ్రెస్ మండల అధ్యక్షురాలు మద్దలి నాగమణి,జిల్లా యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు పెండెం శ్రీకాంత్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పులుగుజ్జు వెంకన్న, సాయిబాబు,మాజీ ఎంపీటీసీలు గుండెబోయిన నాగలక్ష్మి అనిల్ యాదవ్,చాపల ఉమాదేవి, చల్వాయి గ్రామ కమిటీ అధ్యక్షులు వెల్పుగొండ ప్రకాష్, యూత్ కాంగ్రెస్ మండల ప్రధాన కార్యదర్శి పొన్నం సాయి, యూత్ కాంగ్రెస్ నాయకులు మణి చందు, మరియు వివిధ అనుబంధ సంఘాల నాయకులు,మహిళా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అభిమానులు తదితరులు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.