గోపీచంద్‌ నయా సినిమా షురూ..

Written by RAJU

Published on:

గోపీచంద్‌ నయా సినిమా షురూ..గోపీచంద్‌ త్వరలోనే ఓ ఆసక్తికరమైన థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్రాన్ని ఆయన నూతన దర్శకుడు కుమార్‌సాయితో చేయబోతున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బాపినీడు సమర్పణలో బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మిస్తున్నారు. ‘సాహసం’ తర్వాత గోపీచంద్‌ మళ్లీ ఈ బ్యానర్‌లో సినిమా చేస్తున్నారు. అలాంటి ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ గురువారం అధికారికంగా ప్రారంభమైంది. అద్భుతమైన కథనం, గోపీచంద్‌ యాక్షన్‌, హై టెక్నికల్‌ స్టాండర్డ్స్‌తో ఈ చిత్రం రాబోతోంది. ఈ మూవీని అత్యున్నత స్థాయి నిర్మాణ విలువలతో భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. మలయాళ నటి మీనాక్షి దినేష్‌ ఈ థ్రిల్లర్‌లో గోపీచంద్‌ సరసన కథానాయికగా నటించనుంది. ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ త్వరలో ప్రారంభం కానుంది. నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల గురించి మరిన్ని వివరాలను మేకర్స్‌ త్వరలో ప్రకటించనున్నారు. ఈ చిత్రానికి డిఓపి – శామ్‌దత్‌.

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights