ABN
, Publish Date – Apr 03 , 2025 | 01:43 AM
కోరుట్ల రూరల్, ఏప్రిల్ 2 (ఆంధ్రజ్యోతి) : కోరుట్ల మండలంలోని గుమ్లాపూర్ గ్రామాన్ని బుధవారం కేంద్ర, రాష్ట్ర పరిశీలన బృందాలు సందర్శించాయి. స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ్ కార్యక్రమంలో భాగంగా ఓడీఎఫ్, ప్లస్ మోడల్ విలేజ్‌ను కేంద్ర, రాష్ట్ర బృందం పరిశీలించాయి. కేంద్ర బృందం సభ్యులు డిప్యూటీ సెక్రెటరీ కే. శ్రీనివాస్, సెక్షన్ అపీసర్ నితిన్ వర్మ, కన్సల్టెంట్, ఎస్‌బీఎం స్టెట్ డైరెక్టర్ సురేష్‌లు గ్రామంలోని ఇంకుడు గుంతల నిర్మాణం, తడి, పొడి చెత్త వేరు చేసే విధానంపై ఆరా తీశారు. తడి, పొడి చెత్త వేరు చేసే విధానంలో వచ్చే రాబడి గురించి స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు.

వర్మీ కంపోస్టు షెడ్డును పరిశీలిస్తున్న కేంద్ర బృందం సభ్యులు
కోరుట్ల రూరల్, ఏప్రిల్ 2 (ఆంధ్రజ్యోతి) : కోరుట్ల మండలంలోని గుమ్లాపూర్ గ్రామాన్ని బుధవారం కేంద్ర, రాష్ట్ర పరిశీలన బృందాలు సందర్శించాయి. స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ్ కార్యక్రమంలో భాగంగా ఓడీఎఫ్, ప్లస్ మోడల్ విలేజ్‌ను కేంద్ర, రాష్ట్ర బృందం పరిశీలించాయి. కేంద్ర బృందం సభ్యులు డిప్యూటీ సెక్రెటరీ కే. శ్రీనివాస్, సెక్షన్ అపీసర్ నితిన్ వర్మ, కన్సల్టెంట్, ఎస్‌బీఎం స్టెట్ డైరెక్టర్ సురేష్‌లు గ్రామంలోని ఇంకుడు గుంతల నిర్మాణం, తడి, పొడి చెత్త వేరు చేసే విధానంపై ఆరా తీశారు. తడి, పొడి చెత్త వేరు చేసే విధానంలో వచ్చే రాబడి గురించి స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సంఖ్యతో నిర్మాణం చేసిన టాయిలెట్ రూంలను పరిశీలించారు. కేంద్ర తాగు నీరు పారిశుధ్య మంత్రిత్వ శాఖ అధికారుల పరిశీలన బృందం స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ అభివృద్ధి పనులను పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వ తరపున రాష్ట్ర స్వచ్ఛ భారత్ మిషన్ డైరెక్టర్ సురేష్‌బాబు గ్రామాన్ని పరిశీలించారు. పారిశుధ్య పనులను పరిశీలించారు. ఇంకుడు గుంతలు, పారిశుధ్య పనులను పరిశీలించి గ్రామ పంచాయతీ సిబ్బంది వివరాలను నమోదు చేసుకున్నారు. ఆయా కార్యక్రమాల్లో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి నితన్‌వర్మ, కన్స ల్టెంట్ జైపాల్ దక్స్, ఎంపీడీవో రామకృష్ణ, ఎంపీ వో కృపాకర్, ఎస్‌బీఎం కన్సల్టెంగ్ హరిణి, చిరం జీవి, ఐకేపీ ఏపీఎం శంకర్ పాల్గొన్నారు.
Updated Date – Apr 03 , 2025 | 01:43 AM