గుమ్మడికాయ గింజలతో ప్రయోజనాలు ఎన్నో..! వీటిని తినడం అస్సలు మిస్సవ్వకండి..!

Written by RAJU

Published on:

గుమ్మడికాయ గింజలతో ప్రయోజనాలు ఎన్నో..! వీటిని తినడం అస్సలు మిస్సవ్వకండి..!

గుమ్మడికాయ గింజలు చిన్నవిగా కనిపించినా.. వాటిలో అనేక ఆరోగ్యకరమైన పోషకాలు ఉంటాయి. వీటిని తింటే శరీరానికి అవసరమైన కొవ్వులు, మెగ్నీషియం, జింక్ వంటి కీలక పోషకాలు లభిస్తాయి. నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ప్రకారం.. గుమ్మడికాయ గింజలు తినడం వల్ల ఆరోగ్యానికి ఏడు ప్రధాన ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

గుమ్మడికాయ గింజలు రక్తంలో చక్కెరను తగ్గించడంలో సహాయపడతాయి. వీటిలో అధికంగా ఉండే మెగ్నీషియం చక్కెర స్థాయిని నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు ఈ గింజలు తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించుకోవచ్చు. గుమ్మడికాయ గింజలు క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా డయాబెటిస్ నియంత్రణ సాధ్యమవుతుంది.

గుమ్మడికాయ గింజలు చిన్నవిగా ఉండవచ్చు. కానీ వాటిలో ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, మెగ్నీషియం, జింక్, ఐరన్ వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలు శరీరానికి అవసరమైన రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. వీటిని తినడం వల్ల శక్తి స్థాయిలు మెరుగుపడుతాయి. శరీరం ఆరోగ్యంగా ఉంటుంది.

గుమ్మడికాయ గింజలు యాంటీఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్లు, ఫినోలిక్ ఆమ్లాలు, విటమిన్ E వంటి సమృద్ధిగా ఉండే పదార్ధాలతో నిండి ఉంటాయి. ఇవి శరీరంలోని వాపు తగ్గించడంలో సహాయపడతాయి. యాంటీఆక్సిడెంట్లు కణాలను రక్షించి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇవి వృద్ధాప్య సమస్యలను ఆలస్యం చేస్తాయి. హానికరమైన రోగాల నుంచి కాపాడుతాయి.

గుమ్మడికాయ గింజలు మెగ్నీషియంలో పుష్కలంగా ఉంటాయి. మెగ్నీషియం అనేది శరీరంలో చాలా ముఖ్యమైన పోషకం. ఇది రక్తపోటును నియంత్రించడం, ఎముకల బలాన్ని పెంచడం, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడం వంటి అనేక శరీర విధులకు అవసరం. రోజూ ఈ గింజలు తీసుకోవడం ద్వారా మెగ్నీషియం అవసరాలను నెరవేర్చుకోవచ్చు.

గుమ్మడికాయ గింజలు ఫైబర్ సమృద్ధిగా కలిగి ఉంటాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఫైబర్ జీర్ణాశయంలో బాగా పనిచేసి మలబద్ధకం వంటి సమస్యలను నివారిస్తుంది. అలాగే గుండె జబ్బులు, టైప్ 2 డయాబెటిస్, ఊబకాయం వంటి ఆరోగ్య సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది.

గుమ్మడికాయ గింజలు నిద్ర సమస్యలను తగ్గించడంలో కూడా సహాయపడుతాయి. వీటిలో ఉండే ట్రిప్టోఫాన్ అనే పదార్ధం శరీరంలో సెరోటొనిన్, మెళటోనిన్ వంటి నిద్ర హార్మోన్ల ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. దీంతో నిద్ర నాణ్యత మెరుగుపడుతుంది.

గుమ్మడికాయ గింజలు పచ్చిగా లేదా కాల్చి తినవచ్చు. వీటిని సలాడ్‌లు, స్మూతీలకు జోడించి తింటే ఆరోగ్యకరమైన చిరుతిండి అవుతాయి. వీటిని నానబెట్టి లేదా మొలకెత్తించి తీసుకుంటే పోషకాలు మరింతగా అందుతాయి. దీని వల్ల శరీరం ఆహారంలోని పోషకాలను సులభంగా గ్రహించుకోగలదు. గుమ్మడికాయ గింజలు తినడం వల్ల శరీరానికి ఇలా పలు రకాల ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి.

Subscribe for notification