క్రైస్తవుల అతి ముఖ్యమైన పండుగల్లో గుడ్ ఫ్రైడే ఒకటి. క్రైస్తవుల ఆరాధ్య దైవం ఏసుక్రీస్తుకు శిలువ వేసిన రోజే గుడ్ ఫ్రైడే. అయితే గుడ్ ఫ్రైడే వేళ ఏపీ పాస్టర్లకు చంద్రబాబు సర్కార్ గుడ్ న్యూస్ వెల్లడించింది. పాస్టర్లకు నెలకు రూ.5 వేల చొప్పున గౌరవ వేతనం విడుదల చేసేందుకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 2024 మే నుంచి నవంబర్ వరకు వేతనాలు విడుదల చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 8,427 మంది పాస్టర్లకు లబ్దీ చేకూరబోతుంది. ఏడు నెలల కాలానికి గౌరవ వేతనంగా సర్కార్ రూ.30 కోట్లు విడుదల చేయనుండగా.. ఒకొక్క పాస్టరుకు రూ.35,000 చొప్పున లబ్దీ చేకూరుతుంది. యువగళం పాదయాత్ర టైమ్ లో పాస్టర్లకు గౌరవ వేతనం అందిస్తామని మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చారు. గత ఏడాది కూటమి అధికారంలోకి రావడంతో లోకేష్ తన హామీని ప్రభుత్వం ద్వారా అమలు చేశారు. అది కూడా గుడ్ ఫ్రైడే వేళ ఈ నిర్ణయాన్ని ప్రకటించడంతో పాస్టర్లు ఆనందంలో మునిగిపోయారు.
కాగా, గుడ్ ఫ్రైడే సందర్భంగా సీఎం చంద్రబాబు క్రైస్తవుల ఎక్స్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. `లోకానికి శాంతి దూతగా వచ్చిన ఏసుక్రీస్తుకు కల్వరి గిరిపై శిలువ వేసిన శుక్రవారం రోజును గుడ్ ఫ్రైడే గా నిర్వహిస్తాం. శరీరంలోకి మేకులు దించిన సమయంలో కూడా ఆ దేవదూత శాంతినే ప్రబోధించాడు. అందుకే ఆయన చూపిన మార్గం అనుసరణీయం. ఈస్టర్ ఆదివారానికి ముందు వచ్చే శుక్రవారం రోజున జరుపుకునే ఈ పవిత్రదినం రోజు ఉపవాసం ఉండి ఆయనకు నివాళి అర్పించడం క్రైస్తవ సోదరులు పాటించే ఆచారం. క్రీస్తు త్యాగాన్ని స్మరించుకుంటూ, ఆయన బోధనలు పాటిస్తూ సర్వమానవ సమానత్వాన్ని, శాంతిని నెలకొల్పేందుకు కృషి చేద్దాం.` అంటూ బాబు ట్వీట్ చేశారు.
The post గుడ్ ఫ్రైడే స్పెషల్.. ఏపీ పాస్టర్లకు సర్కార్ గుడ్ న్యూస్..! first appeared on namasteandhra.