గుజరాత్‌లో ముక్కలైన భారత యుద్ధ విమానం వెనుక విషాదం..10 రోజుల కిందటే నిశ్చితార్థం.. అంతలోనే.!

Written by RAJU

Published on:

భారత వాయుసేనకు చెందిన జాగ్వార్ ఫైటర్ జెట్ గుజరాత్‌లోని జామ్ నగర్ ప్రాంతంలో కూలిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదం నుంచి ఓ పైలట్‌ సురక్షితంగా బయటపడగా, మరో పైలట్‌ మృతిచెందారు. మృతుడు వైమానిక దళ పైలట్ సిద్ధార్థ్ యాదవ్‌గా గుర్తించారు. ఇక్కడ మరింత విషాధకరమైన విషయం ఒకటి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రమాదంలో మృతిచెందిన పైలట్‌ సిద్ధార్థ్‌కు మార్చి 23న ఢిల్లీకి చెందిన ఓ యువతితో నిశ్చితార్థం జరిగినట్లు తాజాగా కుటుంబ సభ్యులు వెల్లడించారు. నిశ్చితార్థం జరిగిన 10 రోజులకే ఈ దుర్ఘటన జరిగిందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.

భారత వాయుసేనకు చెందిన జాగ్వార్‌ యుద్ధ విమానం గుజరాత్‌లోని జామ్‌ నగర్‌లో కుప్పకూలింది. పొలాల్లో క్రాష్ కావడంతో విమానంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో విమానం రెండు ముక్కలుగా విరిగిపోయినట్లు తెలుస్తోంది. ప్రమాదం నుంచి ఒక పైలెట్ సురక్షితంగా బయటపడగా.. మరో పైలెట్ సిద్ధార్థ్‌ మృతిచెందాడు. ఈ మేరకు భారత వాయుసేన అధికారుల స్పందిస్తూ.. పైలట్‌ మృతిని ధృవీకరించారు. మృతిచెందిన పైలట్‌ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Subscribe for notification
Verified by MonsterInsights