గిన్నిస్ రికార్డ్ కొట్టేసిన ఎలుక..దాని ప్రత్యేకత ఏంటో చూడండి

Written by RAJU

Published on:

గిన్నిస్ రికార్డులు మనుషులేనా..మేం కూడా క్రియేట్ చేయగలం అంటోంది ఓ ఎలుక..ఎలుక రికార్డు క్రియేట్ చేయడమేంటి అనుకుంటున్నారా…అవును అపోపో అనే స్వచ్ఛంద సంస్ధకు చెందిన రోనిన్ ‌ఆఫ్రికన్ జెయింట్ పౌచ్డ్ ర్యాట్ మందుపాతరలను కనిపెట్టడంలో సరికొత్త ప్రపంచ రికార్డును క్రియేట్ చేసింది. ఈ ఎలుక ఇప్పటి వరకు దాదాపు 100కుపైగా మందుపాతరలు, ప్రమాదకరమైన యుద్ధ అవశేషాలను కనిపెట్టింది.

“అపోపో” అనేది ఒక స్వచ్ఛంద సంస్థ, ఈ సంస్థ టాంజానియా కేంద్రంగా పనిచేస్తుంది. ఈ సంస్థ ఎలుకలకు శిక్షణ ఇచ్చి మందుపాతరలను గుర్తించడానికి ఉపయోగిస్తుంది. ఈ సంస్థ దగ్గర 104 ఎలుకలు ఉన్నాయి. ఈ ఎలుకలను యుద్ధభూమిలో వదిలేసిన మందుపాతరలు, ఇతర ఆయుధాల్లో లభించే రసాయనాలను పసిగట్టేలా ఈ సంస్థ శిక్షణ ఇస్తోంది. ఈ ప్రయోగానికి ఎలుకలనే ఎంచుకోవడానికి ప్రధాన కారణం..ఇవి చిన్న సైజులో ఉండటం..మరియు వాసనను త్వరగా పసిగట్టడం. ఈ ఎలుకల సైజు చిన్నగా ఉండటం.. అవి అడుగు పెట్టినా కూడా మందుపాతరలు పేలేంత బరువు లేకపోవడంతో వీటి ద్వారా పేలుడు పదార్థాలను సెర్చ్ చేయడం సులభం అవుతోంది. దీంతో ఈజీగా మందుపాతరలను కనిపెట్టవచ్చుని అపోపో సంస్థవారు చెబుతున్నారు. ఇదే కాదు ఈ ఎలుకలు క్షయ వ్యాదిని కూడా గుర్తించగలవు.

ఈ ఎలుకల్లో మరో ప్రత్యేకత ఉంది. ఇవి మనుషుల కన్నా చాలా వేగంగా పనిచేయగలవు..ఒక మనిషి నాలుగు రోజుల్లో మెటల్‌ డిటెక్టర్‌తో తనిఖీ చేసే ప్రాంతాన్ని.. ఈ ఎలుకలు కేవలం అరగంటలోనే తనిఖీ చేయగలవని అపోపో సంస్థ వారు చెబుతున్నారు. రోనిన్ ‌అనే ఈ ఆఫ్రికన్ జెయింట్ పౌచ్డ్ ర్యాట్ 2021 నుంచి ఇప్పటి వరకు 109 మందుపాతరలను కనిపెట్టినట్టు ఈ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. అయితే 2020లో ఇదే సంస్థకు చెందిన ఓ ఎలుక మాగ్వా ప్రాంతంలో 71 మందుపాతరలను గుర్తించడం ద్వారా గోల్డ్ మెడల్ సాధించగా..ఇప్పుడు రోనిన్ ర్యాట్ 100కుపైగా మందుపాతరలను కనిపెట్టి గిన్నిస్ రికార్డు క్రియేట్ చేసింది. ఈ సంస్థ స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 1,69,713 మందుపాతరలు, ఇతర పేలుడు పదార్థాలను గుర్తించింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..ఇక్కడ క్లిక్ చేయండి

Subscribe for notification
Verified by MonsterInsights