గాంధీ విగ్రహానికి పార్ట్ టైం అధ్యాపకుల వినతి –

Written by RAJU

Published on:

గాంధీ విగ్రహానికి పార్ట్ టైం అధ్యాపకుల వినతి –న‌వ‌తెలంగాణ‌-కామారెడ్డి: భిక్నూర్‌లోని తెలంగాణ విశ్వవిద్యాలయం దక్షిణ ప్రాంగణ పార్ట్ టైం అధ్యాపకులు ఏడో రోజు సమ్మెలో భాగంగా తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని గాంధీ విగ్రహానికి వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ వారు మాట్లాడుతూ.. గాంధీ దృష్టిలో విద్య అనేది సమానత్వం సాధించడానికి ఒక సాధనమని అన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని గాంధీ అభిప్రాయపడ్డారు. విశ్వవిద్యాలయాలలో పనిచేసే అధ్యాపకుల విద్య దేశాభివృద్ధికి తోడ్పడుతుందనీ, అలాంటి విశ్వవిద్యాలయాల్లో.. నేడు పనిచేస్తున్న పార్ట్ టైం అధ్యాపకుల జీవితాలకు ఉద్యోగ భద్రత లేకుండా పోయిందని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. తమకు ఇప్పటివరకు కనీస వేతనం కూడా లేదని వాపోయారు. జి.ఓ 21ని సవరించి తమ సర్వీసులను పరిగణలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. గాంధీజీ ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రంలో ఏర్పడిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. ఇకనైనా పార్ట్ టైం అధ్యాపకుల న్యాయపరమైన డిమాండ్లను గుర్తించి తమకు న్యాయం చేయాలన్నారు. కార్యక్రమంలో వివిధ విభాగాలకు చెందిన పార్ట్ టైం అధ్యాపకులు పాల్గొన్నారు.

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights