ABN
, Publish Date – Mar 24 , 2025 | 12:42 AM
గత ప్రభుత్వ హయాంలోనే అన్ని వర్గా ల్లో సంతోషం ఉండేదని బీఆర్‌ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిండెంట్ కే తారకరామా రావు అన్నారు.

సిరిసిల్ల, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): గత ప్రభుత్వ హయాంలోనే అన్ని వర్గా ల్లో సంతోషం ఉండేదని బీఆర్‌ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిండెంట్ కే తారకరామా రావు అన్నారు. ఆదివారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని షాదీ ఖానాలో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో రంజాన్ సందర్భంగా ముస్లింలకు ఇఫ్తార్‌విందు ఇచ్చారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వంలో పేద ప్రజలతో పాటు అన్ని వర్గాలు సంతోషంగా ఉన్నారని, మళ్లీ కేసీఆర్ ప్రభుత్వం వస్తుందని అన్నారు. బతుకమ్మ చీరలు, ముస్లింలకు తోఫా, క్రిస్టియన్లకు కానుక లను కాంగ్రెస్ తొలగించిందన్నారు. మళ్లీ కేసీఆర్ వస్తారని, పేద ప్రజలను చూసు కుంటారన్నారు. కేసీఆర్ ఎప్పుడూ కూడా మతం పేరుతో రాజకీయం చేయలేద ని, మనిషిని మనిషిలాగే చూశాడన్నారు. లక్షా 40వేల మంది మైనార్టీ విద్యార్థుల కోసం మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేసి ఒక విద్యార్థిపై రూ.1.20 లక్షలు ఖర్చుచేసి విద్యను కేసీఆర్ అందించారన్నారు. ప్రస్తుత ప్రభుత్వం మంచి చేయాలంటే తమకంటే ఎక్కువగా పేదలకు మరిన్ని వసతులు కల్పించాలన్నా రు. కేసీఆర్ అన్ని మతాల వారిని, వారి కట్టుబాట్లను గౌరవించి గంగాజమున తహజీబ్‌లా దేశంలోనే తెలంగాణను ఆదర్శంగా ఉంచారన్నారు. షాదీఖానాలో మిగిలిన పనులు పూర్తిచేస్తానని, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఎమ్మెల్సీ ఎల్ రమణ మాట్లాడుతూ కేసీఆర్ పాలనలో హిందూ ముస్లింలు ఐక్య తగా ఉంటూ దేశంలోనే తెలంగాణను అదర్శంగా నిలిపారని అన్నారు. కేసీఆర్, రెండుసార్లు మహమూద్ అలీని డిప్యూటీ సీఎంగా చేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట అగయ్య, టెక్స్‌టైల్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గూడూరి ప్రవీణ్, మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ జిందం కళ, పట్ట ణ అధ్యక్షుడు జిందం చక్రపాణి,మజీద్ కమిటీ అధ్యక్షుడు సయ్యద్ షమీ, మాజీ అధ్యక్షుడు సలీం, యూసుఫ్, సత్తార్, సెస్ డైరెక్టర్ దార్నం లక్ష్మీనారాయణ, బీ ఆర్‌ఎస్ నాయకులు బొల్లి రామ్మోహన్, రాఘవరెడ్డి, అక్రం పాల్గొన్నారు.
Updated Date – Mar 24 , 2025 | 12:42 AM